Begin typing your search above and press return to search.

హీరోగా వస్తావని ఎదురు చూస్తూ ఉంటే ఇదేమి పని భయ్యా..!

By:  Tupaki Desk   |   7 Dec 2022 5:35 AM GMT
హీరోగా వస్తావని ఎదురు చూస్తూ ఉంటే ఇదేమి పని భయ్యా..!
X
బాలీవుడ్ కింగ్ ఖాన్‌ షారుఖ్ ఖాన్‌ వారసుడు ఆర్యన్‌ ఖాన్‌ బాలీవుడ్‌ లో అడుగు పెట్టబోతున్నాడు అనే విషయం అందరికి తెల్సిందే. ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తాడని... తండ్రి తరహాలోనే లవర్ బాయ్ ఇమేజ్‌ ను సొంతం చేసుకుని తప్పకుండా భారీ విజయాలను సొంతం చేసుకుంటాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆర్యన్ తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఆర్యన్‌ ఖాన్ తన బాలీవుడ్‌ ఎంట్రీ గురించి ప్రకటించాడు. అయితే ఆర్యన్ హీరోగా కాకుండా దర్శకుడిగా సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. అంతే కాకుండా ఆయన రాసుకున్న స్క్రిప్ట్‌ ను ముగించినట్లుగా కూడా పేర్కొన్నాడు.

హీరోగా బాలీవుడ్‌ తెరపై ఎంట్రీ ఇస్తాడని ఆశించిన ఆర్యన్‌ ఖాన్‌ డైరెక్టర్ గా తన మొదటి ప్రయత్నంకు సిద్ధం అయ్యాను అంటూ ప్రకటించాడు. మొదటి ప్రయత్నంలో ఆర్యన్ ఖాన్‌ ఒక వెబ్‌ సిరీస్‌ ను తెరకెక్కించబోతున్నాడట. రెడ్‌ చిల్లీస్ బ్యానర్‌ లో ఈ సినిమాను షారుఖ్ ఖాన్ నిర్మించబోతున్నట్లుగా కూడా ఆర్యన్‌ షేర్ చేసిన ఫొటోను బట్టి అర్థం అవుతోంది.

ఆర్యన్‌ ఖాన్‌ ముందు ముందు అయినా హీరోగా నటించాలని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. ఇక ఆర్యన్ ఖాన్ షేర్ చేసిన ఈ ఫొటోకు షారుఖ్ ఖాన్ మరియు గౌరీ ఖాన్ లు స్పందించారు. తల్లిదండ్రులు అయిన వారిద్దరు కూడా ఆర్యన్ ఖాన్‌ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

మొదటిది ఎప్పుడు అయినా చాలా స్పెషల్‌ గా ఉంటుంది. కనుక ఇది నీకు చాలా స్పెషల్.. దీన్ని చూసేందుకు మేము వెయిట్‌ చేస్తున్నామని కూడా పేర్కొన్నారు. మొత్తానికి ఆర్యన్‌ ఖాన్‌ బాలీవుడ్‌ ఎంట్రీ కన్ఫర్మ్‌ అయ్యింది.. కానీ హీరోగా కాకుండా దర్శకత్వం తో అవ్వడం వల్ల ఒకింత చర్చ జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.