Begin typing your search above and press return to search.

ఆర్యన్ ఖాన్ జైలు జీవితం ఇంకొన్ని రోజులు తప్పవా?

By:  Tupaki Desk   |   14 Oct 2021 1:30 PM GMT
ఆర్యన్ ఖాన్ జైలు జీవితం ఇంకొన్ని రోజులు తప్పవా?
X
అందరూ పండుగ మూడ్ లో ఉండగా... షారుఖ్ ఖాన్ కొడుకు మాత్రం ఇంకా జైల్లోనే డ్రగ్స్ కేసులో రిమాండ్ లో ఉండిపోయాడు. తాజాగా ఆర్యన్ ఖాన్ కు ఈసారి కూడా బెయిల్ లభించలేదు. ఆర్యన్ బెయిల్ పిటీషన్ పై ఎటూ తేల్చకుండానే ముంబైలోని ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు విచారణను ముగించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అక్టోబర్ 20వ తారీఖున తీర్పును రిజర్వ్ చేశారు. దీంతో ఆర్యన్ ఖాన్ కు మరో వారం రోజుల పాటు జైల్లోనే గడపాల్సి ఉంటుంది.

ఓసారి సాంకేతిక కారణాల వల్ల ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ ను మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎన్డీపీఎసూ్ కోర్టులో తప్పకుండా బెయిల్ వస్తుందని షారుఖ్ కుటుంబం భావించింది. దీంతో ఈసారి ఎన్డీపీఎస్ కోర్టులో తప్పకుండా బెయిల్ వస్తుందని షారుఖ్ కుటుంబం భావించింది. కానీ అనూహ్యంగా ఈ కేసులో తీర్పును కోర్టు అక్టోబర్ 20వ తారీఖునకు రిజర్వ్ చేసింది.

ఎన్సీబీ విచారణలో ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ లకు డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్టు తేల్చింది. అర్బాజ్ మర్చంట్‌తో అనుసంధానించబడిన వనరుల నుండి నిషేధిత వస్తువులను సేకరించారని తేల్చింది. వీరి నుండి 6 గ్రాముల చరాస్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్యన్ మరియు అర్బాజ్ ఒకరికొకరు డ్రగ్స్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని తేల్చారు. వీరు నేరాలను పాల్పడ్డారని గుర్తించారు. ఎన్డీపీఎస్ చట్టం కింద సెక్షన్ 29 కేసు నమోదు చేశారు.

ఔషధాల అక్రమ సేకరణ కోసం అంతర్జాతీయ ఔషధ నెట్‌వర్క్‌లో భాగంగా కనిపించే విదేశీ వ్యక్తులతో ఆర్యన్ టచ్‌లో ఉన్నాడని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఎన్సీబీ పేర్కొంది. ఈ రోజు మధ్యాహ్నం 2:45 గంటలకు విచారణను తిరిగి ప్రారంభించిన కోర్టు, రేపు ఉదయం 11 గంటల తర్వాత ఆర్యన్ ఖాన్ బెయిల్ దరఖాస్తుపై విచారణ జరుపుతామని తెలిపింది.

అక్టోబర్ 2న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో జరిగిన పార్టీలో దాడి చేసిన తరువాత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో ఇప్పటివరకు ఇద్దరు నైజీరియన్ జాతీయులతో సహా మొత్తం 20 మందిని అరెస్టు చేశారు.

ఆర్యన్ ఖాన్ ను అక్టోబర్ 3వ తారీఖున అరెస్ట్ చేశారనీ.. 10 రోజులు ముగిసినా విచారణలో ఇప్పుడు ఏస్థాయిలో ఉన్నామన్నది ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి అక్టోబర్ 20వ తారీఖునకు తీర్పును రిజర్వ్ చేశారు. దీంతో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వస్తుందని భావించిన షారుఖ్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు కూడా కలత చెందారు.

ఇదిలా ఉండగా.. ఆర్యన్ ఖాన్ జైలులో ఎన్నో అవస్థలు పడుతున్నాడు. ఇన్నాళ్లు లగ్జరీ లైఫ్ అనుభవించిన ఆర్యన్ ఖాన్ జైలు జీవితాన్ని భరించలేకపోతున్నాడు. అతడు సరిగ్గా భోజనం చేయట్లేడని.. నీరు కూడా కావాల్సినంతగా తాగట్లేడని జైలు అధికారులు తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. భోజనం, నీరు తీసుకుంటే జైలు టాయిలెట్ వాడాల్సి వస్తుందని ఆర్యన్ ఖాన్ భయపడుతున్నాడట.. అలాగే జైలులో ఆర్యన్ ఖాన్ నాలుగు రోజులుగా స్నానం చేయలేదని సమాచారం. దీంతో షారుఖ్ తన కుమారుడు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు.