షారుక్ ఫ్యామిలీతో అనన్య బాండింగ్ చెడిందా?

Thu Oct 06 2022 07:57:08 GMT+0530 (India Standard Time)

Aryan Khan Ananya Panday come face to face

బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే..షారుక్ ఖాన్ కుమార్తె సుహానాఖాన్ మధ్య బాండింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు చైల్డ్ హుడ్ ప్రెండ్స్. గెట్ టూ గెదర్ పార్టీలు...వీకెండ్ పార్టీలంటూ ఇద్దరి ఎంజాయింగ్ మోడ్  వేరు. రేర్ గానూ ఆర్యన్ ఖాన్ కూడా ఆ గ్యాంగ్ లో కలుస్తుంటాడు. కలిసి చిలౌట్ అవుతుంటారు. షారుక్ ఫ్యామిలీతో అనన్య ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతుంది.సుహానా-ఆర్యన్ ల కోసం ఎక్కువగా బాద్ షా ఇంటికి వెళ్తుంది. సమయం  చిక్కితే ముగ్గురు ఇంట్లోనే కాలక్షేపం చేస్తుంటారు. మరి ఇప్పుడా ఫ్యామిలీతో అనన్య బాండింగ్ చెడిందా?  వ్యవహారం మూతి బిగించే వరకూ వచ్చిందా? అంటే అవుననే అనిపిస్తుంది తాజా సన్నివేశాన్ని బట్టి. నిన్నటి రోజున `మాజామా` మూవీ స్ర్కీనింగ్ కి అనన్యా పాండే హాజరైంది.

అదే షోకి ఆర్యన్ ఖాన్ కూడా  వెళ్లాడు.  అయితే ఇంటర్వెల్ సమయంలో ఇద్దరు ఎదురెదురు పడ్డారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కానీ పలకరించుకున్న సన్నిఇవేశం గానీ... నవ్వుకున్న సీన్ గానీ అక్కడ కనిపించలేదు. అనన్యవైపు గుర్రుగా చూస్తూ ఆర్యన్ అనన్యకి ఎదురుగా వెళ్లిపోవడమే ఈ సందేహాలన్నింటికి తావిస్తోంది.

ఆ సమయంలో కూడా అనన్య నుంచునే చోటనే ఉంది కానీ..ఆర్యన్ ని చూసి ఒక్క అడుగు ముందుకువేయడం గానీ..వెనక్కి వెళ్లడం గానీ...అటు ఇటు గా చూడటం కానీ చేయలేదు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం చెండిందా? అన్న సందేహాలు బలపడుతున్నాయి. ఆ మధ్య `కాఫీ విత్ కరణ్ టాక్` షోలో అమ్మడు ఆర్యన్ పై క్రష్ గురించి రివీల్ చేసింది.

ఈ విషయం గురించి ఆర్యన్ నోరు విప్పింది లేదు. ఇష్టం..అయిష్టం అని  ఎక్కడా చెప్పలేదు.  దీంతో ఇద్దరి మధ్య అసలేం జరిగిందన్నది ఆసక్తికరంగా మారింది. సమస్య ఆర్యన్ తోనా?  షారుక్ కుటుంబంతోనా? అంటూ నెటి జనులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో బుక్కైన సంగతి తెలిసిందే. అందులో అన్యన్యా పాండే పేరు కూడా తెరపైకి వచ్చింది. అప్పటి నుంచే ఇద్దరి మధ్య మూతి బిగింపు వ్యవహారం మొదలైందని కొంత మంది నెటి జనులు అభిప్రాయపడుతున్నారు. మరి అసలు సంగతేంటి? అన్నది తెలియాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.