Begin typing your search above and press return to search.

బీస్ట్ తో కాపుర‌మా.. సుకుమారి మ‌టాషే!

By:  Tupaki Desk   |   20 Feb 2020 7:00 AM GMT
బీస్ట్ తో కాపుర‌మా.. సుకుమారి మ‌టాషే!
X
త‌మిళ్ హీరో ఆర్య‌ ఫిట్ నెస్ ఫ్రీక్ అన్న సంగ‌తి తెలిసిందే. అల్లు అర్జున్ `వ‌రుడు`లో విల‌న్ గా క‌నిపించిన‌ప్పుడే అత‌డి బీస్ట్ రూపం బ‌య‌ట‌ప‌డింది. బ‌న్నీకి ధీటుగా ఆ సినిమాలో క‌నిపించాడు ఆర్య‌. ఆ త‌ర్వాతా అత‌డు లుక్ ప‌రంగా ఏమాత్రం త‌గ్గ‌లేదు. ప‌ర్ఫెక్ట్ టోన్డ్ బాడీని మెయింటెయిన్ చేస్తూ మ‌గువ‌ల గుండెల్లో గుబులు పుట్టించాడు. నాకు పిల్ల కావ‌లెను అంటూ కొన్నాళ్లు బాధ‌ప‌డినా.. ల‌క్కీగా అయేషా సైగ‌ల్ అత‌డికి చిక్కింది. తంబీల్లోనే ఆర్య ఎంతో స్పెష‌ల్ హీరో. అత‌డి క‌ఠోర శ్ర‌మ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాడీని విల్లులా వంచేసేంత ఫిట్ గా ఉంటాడు. ప్ర‌స్తుతం బాక్సింగ్ నేప‌థ్యంలో ఓ సినిమా చేయ‌డానికి స‌న్న‌ధం అవుతున్నాడ‌ట‌.

అందుకోసం ఆర్య ఏం చేస్తున్నాడో చూశారు క‌దా! హాలీవుడ్ హీరోల్నే త‌ల‌ద‌న్నేలా...ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ‌ర్ బాడీనే త‌ల‌పించేలా ఆర్య రూపం మార్చేశాడు. అందుకు సంబంధించిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. స్వ‌యంగా ఈఫోటోని ఆర్య స‌తీమ‌ణి.. న‌టి స‌యేషా సైగల్ అభిమానుల‌కు షేర్ చేసింది. ఈ సంద‌ర్భంగా త‌న హ‌బ్బీ శ్ర‌మ‌.. క‌షి.. ప‌ట్టుద‌ల గురించి చెప్పి మురిసిపోయింది. ఈ ఫోటోల‌ను బ‌ట్టే ఆర్య బాడీ ప‌రంగా ఎన్ని మార్పులు తీసుకొచ్చాడో అర్థ‌మ‌వుతోంది. ఆ రెండు చేతులు పైకెత్తి ఊపిరి బిగించి కండ‌లు చూపిస్తూ షేక్ చేసేస్తున్నాడు.

ఆర్య ఫ్రంట్ లుక్ మాత్రం ఇప్ప‌టికి స‌స్పెన్స్. మ‌రి ఈ కొత్త లుక్ తాజా సినిమాకోస‌మేనా? లేక ఫిట్ నెస్ లో భాగంగా ఇలా ప్ర‌య‌త్నించాడా? అన్న‌ది త‌నే చెప్పాల్సి ఉంటుంది. ఆర్య కొత్త సినిమా ప్ర‌క‌ట‌న ఈ శుక్ర‌వారం వెలువ‌డ‌నుంది. బాక్సింగ్ నేప‌థ్యం అంటున్నారు కాబ‌ట్టే ఈ బీస్ట్ లుక్ అని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆర్య‌-స‌యేషా జంట‌గా టెడ్డీ అనే సినిమా సెట్స్ పై ఉంది. త్వ‌ర‌లో ఇది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆర్య‌- స‌యేషా జంట‌గా పెళ్లైన త‌ర్వాత న‌టిస్తున్న తొలి చిత్ర‌మ‌ది. అన్న‌ట్టు మ‌రీ ఇలా బీస్ట్ లా మారాడు. త‌న‌తో కాపురం అంటే సుకుమారి స‌యేషా ఇక‌ మ‌టాషేనేమో!