ఎన్టీఆర్ తో తలపడే విలన్ గా అరవింద్ స్వామి?

Mon May 03 2021 15:00:01 GMT+0530 (IST)

Arvind Swamy as the villain in NTR movie

కొరటాల శివ ప్రస్తుతం 'ఆచార్య' సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ఓ పది పదిహేను రోజులు పాటు చిత్రీకరణ జరిపితే షూటింగు పార్టు మొత్తం పూర్తవుతుందట. కరోనా ఉధృతి కాస్త తగ్గగానే చకచకా ఆ వర్క్ ను పూర్తి చేయాలనే ఉద్దేశంతో కొరటాల ఉన్నారని చెబుతున్నారు. ఈ సినిమా తరువాత ఆయన ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. విడుదల తేదీతో సహా ఈ ప్రాజెక్టును అధికారికంగా వెల్లడించారు కూడా. ఓ వైపు నుంచి ఈ స్క్రిప్ట్ కి సంబంధించిన కసరత్తు నడుస్తూనే ఉందని అంటున్నారు.ఈ కథ రాజకీయాలను టచ్ చేస్తూ సాగుతుందనీ .. స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్లో సినిమా అనేసరికి అంతా కూడా విలన్ పాత్రను ఎవరు చేస్తారా? అనే ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎందుకంటే  విలన్ పాత్రలను కొరటాల డిజైన్ చేసే తీరు చాలా కొత్తగా ఉంటుంది. ఆయన సినిమాల్లో విలన్ అరిచి గొడవ చేయడు .. చాలా నీట్ గా .. డీసెంట్ గా తన పనులను చక్కబెడుతూ ఉంటాడు. ఎన్టీఆర్ సినిమాలోను విలన్ రోల్ ఇదే తరహాలో కనిపిస్తుందని అంటున్నారు.

ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ఫుల్ ఉంటుందట .. అదే సమయంలో ఆ పాత్ర పన్నే వ్యూహాలు .. దెబ్బతీసే విధానం వెరైటీగా ఉంటాయట. అందువలన విలన్ పాత్రలకు చాలామంది ఆర్టిస్టుల పేర్లను పరిశీలించిన కొరటాల అరవిందస్వామి అయితే కరెక్టుగా ఉంటాడనే అభిప్రాయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. 'ధ్రువ' సినిమాకి విలన్ గా అరవింద్ స్వామి ఎంత ప్లస్ అయ్యాడనే విషయం తెలిసిందే. అందువలన ఆయననే సంప్ర్రదించే ఆలోచనలో ఉన్నారని అనుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతనే విషయాన్ని అలా ఉంచితే ప్రస్తుతం అరవిందస్వామి మాత్రం ఫుల్ బిజీ. ఆయన చేతిలో అరడజను తమిళ సినిమాల వరకూ ఉన్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.