Begin typing your search above and press return to search.

నాగచైతన్య సినిమాలో సీనియర్ స్టార్ హీరో!

By:  Tupaki Desk   |   28 Sep 2022 4:22 AM GMT
నాగచైతన్య సినిమాలో సీనియర్ స్టార్ హీరో!
X
అక్కినేని నాగచైతన్య ఇటీవల థాంక్యూ సినిమాతో ఊహించిన విధంగా డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. చివరగా బంగార్రాజు సినిమాతో సంక్రాంతి ఫెస్టివల్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అక్కినేని హీరో ఆ తర్వాత వరుసగా రెండు సినిమాలతోనూ నిరాశపరిచాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన థాంక్యూ సినిమా డిజాస్టర్ కాగా ఆ తర్వాత హిందీలో లాల్ సింగ్ చడ్డా సినిమాలో సపోర్టింగ్ లో కనిపించగా అది కూడా డిజాస్టర్ అయింది.

ఇక తదుపరి సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. మాస్ యాక్షన్ సినిమాలను అద్భుతంగా తెరపైకి తీసుకు వచ్చే తమిళ దర్శకుడు వెంకట ప్రభు నాగచైతన్య 22వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ప్రస్తుతం మైసూర్ లో ఒక షెడ్యూల్ కొనసాగిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో మరో ప్రముఖ సీనియర్ హీరో కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు ఇది వరకే దృవ సినిమాలో రామ్ చరణ్ కు విలన్ గా కనిపించిన సీనియర్ స్టార్ అరవింద్ స్వామి అని తెలుస్తోంది.

అప్పట్లో ముంబాయి, రోజా సినిమాలతో తెలుగు వారికి బాగా దగ్గరైన అరవింద్ స్వామి ఎంతో మంచి పాత్ర వస్తే గాని మళ్ళీ ఇతర హీరోల సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.

ఇక ఇప్పుడు నాగచైతన్య సినిమాలో కూడా కాస్త నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక సినిమాలో స్పెషల్ పాత్రలో అరవింద్ స్వామిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

అందుకోసం ఆయనకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా ఇచ్చారట. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు నాగచైతన్య దూత వెబ్ సీరీస్ విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే మరో రెండు ప్రాజెక్ట్ లు కూడా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.