స్టెప్పులు వేయడంలోనూ ఐకానిక్ స్టైల్

Fri Jan 17 2020 16:47:19 GMT+0530 (IST)

Arvind Swami As MGR First Look

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా `తలైవి` సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. అమ్మ పాత్ర పోషిస్తున్న కంగనా రనౌత్ లుక్ ఇంతకుముందు రిలీజైంది. లేటెస్టుగా నేడు లెజెండరీ నటుడు ఎంజీఆర్ పాత్ర ఫస్ట్ లుక్ రివీలైంది. ఎంజీఆర్ పాత్రలో అందగాడు అరవింద స్వామి యాప్ట్ గా ఉన్నారన్న ప్రశంసలు దక్కాయి. ఈ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా రిలీజైన ఫస్ట్  లుక్ పోస్టర్ ఇప్పటికే ఆసక్తి రేకెత్తించింది. అరవింద్ స్వామి రియల్ ఎంజీఆర్ ని తలపించారన్న ప్రశంసలు దక్కాయి.ఈ కొత్త లుక్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్  అవుతోంది. తాజాగా ఎంజీఆర్ నటించిన పుదై భూమి చిత్రంలోని ఓ క్లాసిక్ సాంగ్ ని తలైవి కోసం రీమిక్స్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళ ప్రజల ఆల్ టైమ్  ఫేవరెట్  సాంగ్ `నను ఉంగళ్  వీటు పిళ్లై` అనే పాటలో ఎంజీఆర్ స్టెప్పులను రీక్రియేట్ చేస్తున్నారు. నాటి క్లాసిక్ మూవీలోని ఎంజీఆర్ స్టెప్పులు వేస్తున్న టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో అరవిందస్వామి అభివాదం చూస్తుంటే ఎంజీఆర్ ఎక్స్ ప్రెషన్ డ్రెస్సింగ్ సెన్స్ సహా ప్రతిదీ ఇమ్మిటేట్ చేయడం.. తనదైన శైలిలో ప్రెజెంట్ చేయడం ఆకట్టుకుంది.

ఎంజీఆర్ పాత్రలో ఆత్మను పట్టుకునేందుకు స్వామి తనదైన శైలి ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతోంది. తాజా టీజర్ వైరల్ గా దూసుకెళుతోంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే రకరకాల వివాదాలు వేడి పెంచిన సంగతి తెలిసిందే. అటు జయలలిత మేనకోడలు సుప్రీం కోర్టులో పిల్ వేయడానికి రెడీ అవుతున్నా....చిత్రబృందం అదేమీ పట్టించుకోవడం లేదు. చిత్రీకరణ పరంగా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎవరి పని వారిదే అంటూ ముందుకెళ్లిపోతున్నారు. ఈచిత్రాన్ని ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో విష్ణు ఇందూరి- శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తిచేసి జూన్ 26న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.