షాహిద్ అడిగిన రెమ్యునరేషన్ కి షాక్ అయిన నిర్మాతలు!

Tue Oct 15 2019 15:15:45 GMT+0530 (IST)

దిల్ రాజు అల్లు అరవింద్ తెలుగులో ఎంత పెద్ద నిర్మాతలో అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళిద్దరూ బాలీవుడ్ లో కూడా పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అరవింద్ ఇప్పటికే బాలీవుడ్ లో 'గజిని' లాంటి కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. కానీ దిల్ రాజు మాత్రం ఇప్పుడే బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. నాని తెలుగులో చేసిన సినిమా 'జెర్సీ' ని ఈ స్టార్ ప్రొడ్యూసర్స్ ఇద్దరూ హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఈ మధ్యే తెలుగు సినిమా 'అర్జున్ రెడ్డి' ని రీమేక్ చేసి 'కబీర్ సింగ్' తో హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఇప్పుడు హిందీ 'జెర్సీ' లో హీరోగా చేయబోతున్నాడు.కానీ ఈ సినిమాకి షాహిద్ అడిగిన రెమ్యునరేషన్ విని మన ప్రొడ్యూసర్స్ షాక్ అయ్యారు. షాహిద్ దాదాపుగా 50కోట్లు పారితోషకం అడిగాడు. దీంతో ఆలోచనలో పడ్డ నిర్మాతలు అతనితో మాట్లాడి ఒక డీల్ కి వచ్చినట్టు తెలుస్తుంది. అతనికి కొంత రెమ్యునరేషన్ తో పాటు సినిమాపై వచ్చిన ప్రాఫిట్స్ లో 30% ఇస్తామని ప్రొడ్యూసర్స్ చెప్పడంతో షాహిద్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది.

దిల్ రాజు ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలను బాలీవుడ్ లో ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో తాను నిర్మించిన 'ఎఫ్ 2' సినిమాను హిందీలో బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా నిర్మాణంలో బోనీతో పాటు దిల్ రాజు కూడా చేతులు కలుపుతున్నాడు. అల్లు అరవింద్ కూడా దంగల్ మూవీ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో వస్తున్న 'రామాయణం' సినిమాకు కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు. వీళ్ళు తీసే సినిమాలు హిట్ అయ్యి బాలీవుడ్ లో మన తెలుగు నిర్మాతల హవా కొనసాగాలని తెలుగు సినీ అభిమానులు కోరుకుంటున్నారు.