ఏనుగు.. ఎత్తిపడేసి తొక్కుతాడు

Wed Jun 29 2022 18:16:23 GMT+0530 (IST)

Arun Vijay Enugu Film New Glimpse

అరుణ్ విజయ్ హీరోగా నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఏనుగు'. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్ టైన్ మెంట్ డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్ హౌస్ బ్యానర్ లపై సీహెచ్ సతీష్ ఈ మూవీని నిర్మించారు. 'సింగం' సిరీస్ చిత్రాలతో హై వోల్టేజ్ యాక్షన్ మార్కు సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీని జూలై 1న తమిళ తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు.ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. ఇతర కీలక పాత్రల్లో సముద్రఖని 'కేజీఎఫ్' గరుడ' రామచంద్రరాజు రాధిక శరత్ కుమార్ మోగిబాబు నటించారు.

ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది.  

ఈ నేపథ్యంలో చిత్ర బృందం రిలీజ్ ప్రోమోని విడుదల చేసింది. 'భయం అంటే ఏంటో నేను చూపిస్తాను రా.. రారా.. రారా.. రారా.. అనే డైలాగ్స్ తో ప్రోమో మొదలైంది. అరుణ్ విజయ్ పై చిత్రీకరించిన యాక్షన్ గట్టాలు...'కేజీఎఫ్' గరుడ' రామచంద్రరాజు ఎంట్రీ.. హీరో క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ  'ఎత్తపడేసి తొక్కుతాడు..' అంటూ ఓ వ్యక్తి చెబుతున్నడైలాగ్ లు.. తలమీదున్న వెంట్రుక్కి సమం.. అని సముద్ర అంటుంటే.. నేను లేపేస్తా అని మోగిబాబు కామెడీగా చెబుతున్న డైలాగ్ లు.. ఎందుకు కొట్టాం.. దేనికి కొట్టాం అని ఎవ్వడికీ అర్థం కాకూడదు అంటూ హీరో అరుణ్ విజయ్ పలికిన సంభాషణలు సినిమా ఓ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా అని తెలియజేస్తున్నాయి.  

సింగం సిరీస్ చిత్రాలతో పవర్ ఫుల్ యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరున్న హరి దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత చేసిన సినిమా ఇది. తన మార్కు యాక్షన్ తో ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఈ మూవీని తెరకెక్కించారు.

తమిళ్ తో పాటు తెలుగులోనూ ఏక కాలంలో జూలై 1న ఈ మూవీ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇది గ్రాండ్ సక్సెస్ అయితే దర్శకుడు హరి మళ్లీ తనదైన మార్కు సినిమాలతో స్పీడు పెంచబోతున్నారట. హీరో గోపీచంద్ తో భారీ బైలింగ్వల్ మూవీకి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.