కరాటే కళ్యాణికి క్లీన్ చీట్ వచ్చిందట..!

Wed May 18 2022 20:02:17 GMT+0530 (IST)

Artist karate kalyani

కరాటే కళ్యాణి దత్తత విషయంలో వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ అధికారులకు అందిన ఫిర్యాదుతో కరాటే కళ్యాణి ఇంట్లో సోదాలు నిర్వహించిన విషయం తెల్సిందే. కరాటే కళ్యాణి పిల్లలను అక్రమంగా దత్తత తీసుకుని వారిని అమ్మేస్తుంది అంటూ కొందరు ఆరోపించిన నేపథ్యంలో కమిషన్ అధికారులు సోదాలు నిర్వహించగా ఇద్దరు పిల్లలకు సంబంధించిన వివరాలు తెలిశాయి.ముఖ్యంగా ఒక చిన్నారికి సంబంధించిన విషయంలో కరాటే కళ్యాణి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అక్రమంగా రూల్స్ కు విరుద్దంగా కరాటే కళ్యాణి బాలికను తల్లిదండ్రుల నుండి దత్తత తీసుకుంది అంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆమె మీడియా ముందుకు వచ్చి స్పందించిన విషయం తెల్సిందే. ఆ బాలిక తల్లిదండ్రులు తన వద్దే ఉంటున్నారు. ఇప్పటి వరకు ఆ బాలికను దత్తత తీసుకోలేదు అంది.

తనకు పిల్లలు అంటే ఇష్టం కనుక నేను  వారి నుండి చట్టపరంగా బాలికను దత్తత తీసుకోవాలనుకున్నాను. కాని ఇప్పటి వరకు తాను దత్తత తీసుకోలేదు. వారిని కూడా తనతోనే ఉంచుకుని దత్తత చేసుకునే వరకు పాపను వారితో పాటు నేను కూడా చూసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. అదే విషయాన్ని కమీషన్ అధికారుల ముందు విచారణకు హాజరు అయ్యి సాక్ష్యాధారాలను సమర్పించిందట.

విచారణ అధికారులను కలిసిన తర్వాత మీడియాతో కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. తాను దత్తత తీసుకుంటే చట్ట పరంగానే తీసుకుంటాను అని.. కాని ఇప్పటి వరకు తాను పాపను దత్తత తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. తన కుటుంబ సభ్యుల గురించి.. నా గురించి మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. నాపై వస్తున్న ఆరోపణలతో నా తల్లి తమ్ముడు ఆత్మహత్య చేసుకోవాలన్నంతగా బాధపడుతున్నారు.

వారికి ధైర్యం చెప్పుకుంటున్నాను. మీడియాలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు... ఎవరికి వారు అన్నట్లుగా కథనాలు అల్లేస్తున్నారు. చైల్డ్ లేబర్ అధికారులు నాకు క్లీన్ చీట్ ఇచ్చారంటూ చెప్పుకొచ్చింది. తనపై ఆధారాలు లేకుండా మీడియాలో పుకార్లు పుట్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ పేర్కొంది. పిల్లల దత్తత విషయంలో క్లారిటీ వచ్చినా ఇతర విషయాల్లో ఆమె కేసులు ఎదుర్కొంటూనే ఉన్నారు.