Begin typing your search above and press return to search.

కరాటే కళ్యాణి పై కేసుల మీద కేసులు

By:  Tupaki Desk   |   15 May 2022 11:30 AM GMT
కరాటే కళ్యాణి పై కేసుల మీద కేసులు
X
కరాటే కళ్యాణి మరియు యూట్యూబర్ శ్రీకాంత్ మద్య గొడవ కాస్త చిలికి చిలిక అన్నట్లుగా పెద్దది అయ్యింది. ఒకరి పై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో పాటు మీడియా ద్వారా ఒకరి మీద ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ... నేను ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నాను కనుక కరాటే కళ్యాణి కి డబ్బు ఇచ్చి పర్మీషన్ తీసుకోవాలి అన్నట్లుగా ఆదేశించింది. కాని నేను డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో కొట్టించిందని శ్రీకాంత్ ఆరోపిస్తున్నాడు.

శ్రీకాంత్‌ ఇప్పటికే కేసు నమోదు చేయడం.. కరాటే కళ్యాణి కూడా కేసు పెట్టడంతో ఇక్కడితో అంశం క్లోజ్ అయ్యిందని అంతా అనుకున్నారు. కాని కరాటే కళ్యాణి ఎపిసోడ్‌ రోజు రోజుకు అలా అలా పెరుగుతూ వస్తోంది. ఎస్ ఆర్ నగర్‌ పోలీస్‌ స్టేషన్ లో శ్రీకాంత్‌ మరియు కరాటే కళ్యాణి లు కేసులు పెట్టుకున్నాఉ. శ్రీకాంత్‌ మరియు కరాటే కళ్యాణి లపై ఒక తరహ కేసులు నమోదు అయ్యాయి.

ఒక మహిళ పెట్టిన కేసు విషయంలో సీఐ సైదులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇరువురిపై ఒకే రకమైన కేసులు ఎలా పెడతారు అంటూ సీఐ తీరును పోలీస్‌ స్టేషన్ లోనే విమర్శించింది. దాంతో అక్కడున్న పోలీసులు ఆమెను బయటకు బలవంతంగా పంపించారు. పదే పదే పోలీసులను విమర్శిస్తే మరో కేసును నమోదు చేయాల్సి ఉంటుందని వారు హెచ్చరించారట.

ఇక కరాటే కళ్యాణి గతంలో ఒక రేప్ కేసు విషయంలో బాధితురాలి పేరు మరియు ఫోటో ను మీడియాకు ఇవ్వడం పట్ల ఒక వ్యక్తి గతంలో అభ్యంతరం వ్యక్తం చేశాడట. అప్పట్లో ఆమె తీరును వ్యతిరేకించినందుకు గాను నీ అంతు చూస్తాను అంటూ హెచ్చరించిందట. దాంతో బాధితుడు ఇప్పుడు కరాటే కళ్యాణి నుండి తనకు ప్రాణ భయం ఉందంటూ కొత్తగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ కేసులు కాకుండా కరాటే కళ్యాణి పై చీటింగ్‌ కేసు కూడా నమోదు అయ్యింది. ఒక ప్రాపర్టీ కొనుగోలు విషయం లో ఒక వ్యక్తి నుండి దాదాపుగా నాలుగు లక్షల రూపాయల మొత్తంను కరాటే కళ్యాణి తీసుకుందట. ఇప్పుడు వారు కూడా మీడియా ముందుకు వచ్చి తమను కరాటే కళ్యాణి ఇబ్బంది పెట్టిందని ఫిర్యాదు ఇస్తున్నారు. మొత్తానికి కరాటే కళ్యాణి తీగ లాగితే డొంక అంతా కదిలినట్లుగా మొత్తం వ్యవహారం బయటకు వచ్చేస్తున్నాయి. వీటిపై కరాటే మేడం ఎలా స్పందిస్తారో చూడాలి.