తల్లీ-కూతురుపై అరెస్ట్ వారెంట్..XXX తెచ్చిన తంట!

Thu Sep 29 2022 12:01:08 GMT+0530 (India Standard Time)

Arrest warrant for Ekta Kapoor And Shobha Kapoor

బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ - అమె తల్లి శోభాకపూర్  కు బీహార్‌లోని బెగుసరాయ్‌లోని కోర్టు బుధవారం అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. దీంతో పోలీసులకు అరెస్ట్ కి రంగం సిద్దం చేసారు. ఇప్పుడా ఇద్దరి కోసం పోలీసు లు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి తల్లీ-కూతుళ్లు ఏ కారణంగా అరెస్ట్ అవుతున్నారు. కోర్టు ఎందుకు వారెంట్ జారి చేసిందో? తఎలియాలంటే  వివరాల్లోకి వెళ్లాల్సిందే.  ఏక్తా కపూర్ నిర్మించిన  వెబ్ సిరీస్ XXX సీజన్2 లో సైనికులను కించపరచడం మరియు వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసిన ఆరోపణలపై  సినీ నిర్మాత మరియు దర్శకురాలు  ఏక్తా కపూర్  ఆమె తల్లి శోభా కపూర్‌పై బెగుసరాయ్ నివాసి.. మాజీ సైనికుడు శంభు కుమార్ చేసిన ఫిర్యాదు చేసారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయ స్థానం .. న్యాయమూర్తి వికాస్ కుమార్ ఈ వారెంట్ జారీ చేశారు. మిస్టర్  కుమార్  2020లో  ఈరకంగా కంప్లైయింట్ ఇచ్చారు.

తను ఇచ్చిన ఫిర్యాదులో  XXX సీజన్-2 సిరీస్‌లో సైనికుడి భార్యకు సంబంధించిన అనేక అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు.

ఈ వివాదానికి సబంధించిన ఎపిసోడ్స్ కూడా ఏక్తా కపూర్ కు చెందిన బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ యాజమాన్యంలోని  ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయిన ఏఎల్ టీ బాలాజీలో ప్రసారం చేసారు. ఏక్తా కపూర్ తల్లి శోభా కపూర్ కూడా ఇందులో భాగస్వామిగా ఉండటంవల్ల ఆమెపై కూడా కేసు నమోదు అయింది.

బాలాజీ టెలిఫిల్మ్స్‌తో ఏక్తాకపూర్ తో పాటు ఆమె తల్లికి కూడా సంబంధం కలిగి ఉంది అని శంభు కుమార్ న్యాయవాది హృషికేష్ పాఠక్ కోర్టుకు విన్నవించారు.

దాంతో కోర్టు  ఏక్తా కపూర్ తో పాటు ఆమె తల్లి శోభా కపూర్ కు  కూడా  సమన్లు జారీ చేసింది.   కోర్టుకు తప్పకుండా హాజరుకావాలిన ఆదేశంచింది. ఈ విషయంలో   ఫిర్యాదు అందిన వెంటనే  ఈసిరిస్ లోని అభ్యంతరకర సన్నివేశాలు  కొన్ని తొలగించినట్లు కోర్టుకు తెలియజేశారు. కానీ  కోర్టు ఆదేశం ప్రకారం వారు హాజరు కాకపోవడంతో వారిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.