Begin typing your search above and press return to search.

బర్త్‌ డే కు రెండు విధాలుగా భారీ ఏర్పాట్లు

By:  Tupaki Desk   |   30 July 2021 1:40 PM GMT
బర్త్‌ డే కు రెండు విధాలుగా భారీ ఏర్పాట్లు
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు కు సంబంధించిన చిన్న విషయం కూడా ఆయన అభిమానులకు పెద్ద పండుగ. అలాంటిది ఆయన పుట్టిన రోజు అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్‌ బాబుకి పెళ్లయి పిల్లలున్నా ఇప్పటికీ ఆయనంటే మహిళా అభిమానులు పడి చస్తారు. అటువంటి మహేష్‌ బాబు నుంచి సినిమా వస్తుందంటే ఆయన అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు. ఆయన నుంచి మహర్షి లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత సర్కారు వారి పాట సినిమా రాబోతున్న విషయం తెల్సిందే. గీత గోవిందం లాంటి బ్లాక్ బాస్టర్ మూవీను తెరకెక్కించిన దర్శకుడు పరుశురామ్ సర్కారు వారి పాటకు దర్శకత్వం వహిస్తున్నారు.

అందాల బొమ్మ, నేషనల్ అవార్డు విన్నర్ మహా నటి కీర్తి సురేష్ ఈ మూవీలో మహేష్‌ బాబు సరసన నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ఇక పోతే ఈ మూవీకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు సమకూరుస్తుండడం విశేషం. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ స్టిల్స్ కు అందులో మహేష్‌ బాబు గెటప్స్ కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు ఈ మూవీ గురించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా కూడా వదలడం లేదు. దానిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అసలు ఈ చిత్ర సెట్ లో ఫొటోలు వీడియోలు ఎలా లీక్ అవుతున్నాయో తెలియక దర్శక నిర్మాతలు తికమకపడుతున్నారు.

తాజాగా మహేష్‌ బాబు చెప్పిన భారీ లెంగ్త్ డైలాగ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇలా లీకు వీరుల వల్ల చిత్ర యూనిట్ తల పట్టుకుంటుందట. ఈ లీకుల విషయంపై తాజాగా సూపర్ స్టార్ మహేష్‌ బాబు మూవీ యూనిట్ కు స్ర్టాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. చిత్ర హీరో సూపర్ స్టార్ మహేష్‌ బాబు జన్మదినం సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ ఒకటి ఫ్యాన్స్ కోసం తప్పకుండా ఉంటుందని అభిమానులు మొదటి నుంచే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వారి అంచనాలను నిజం చేస్తూ... మహేష్‌ బాబు జన్మదినం సందర్భంగా మూవీ నుంచి ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. మేకర్స్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడంతో ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఎలాగూ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంటుంది. కావున మరో సర్ ప్రైజ్ కింద మూవీ టీజర్ ను తప్పక రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నారు.

ఇక అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్ర దర్శకుడు పరుశురామ్ టీజర్ ను అదిరిపోయే డైలాగులతో నింపినట్లు తెలుస్తోంది. ఈ టీజర్ లో మహేష్‌ బాబు డైలాగులు పిచ్చెక్కిస్తాయట. కావున మహేష్‌ అభిమానులకు ఆయన జన్మదినం సందర్భంగా ట్రీట్ భారీ స్థాయిలో ఉండేలా కనిపిస్తోంది. మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున చారిటీ కార్యక్రమాలు కూడా చేసేందుకు సిద్దం అయ్యారు. ఇక సర్కారు వారి పాట సినిమా తో మహేష్‌ బాబు ను కొత్తగా చూస్తామని అభిమానులు అంటున్నారు. మొత్తానికి సినిమా మరో లెవల్‌ లో ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు మహేష్ బాబు త్రివిక్రమ్‌ మూవీ అప్ డేట్‌ వస్తుందా అంటూ కొందరు ఎదురు చూస్తున్నారు.