ట్రైలర్ టాక్: 13 కోట్ల స్కాం నిగ్గు తేల్చే జర్నలిస్ట్

Tue Nov 19 2019 20:04:53 GMT+0530 (IST)

Arjun Suravaram Trailer

అర్జున్ సురవరం.. గత కొంతకాలంగా రకరకాల కారణాలతో నిరంతరం వార్తల్లో నానుతున్న టైటిల్ ఇది. నిఖిల్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా రకరకాల కారణాలతో ఆలస్యమైంది. తొలుత ముద్ర అనే టైటిల్ అనుకున్నా వివాదాల వల్ల టైటిల్ మార్చారు. గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాప్ రెడ్డి స్ఫూర్తితో అర్జున్ సురవరం టైటిల్ ని ఎంపిక చేసుకున్నారు.ఈ కొత్త టైటిల్ జనాల్లోకి బాగానే దూసుకెళ్లింది. అయితే రిలీజ్ వాయిదానే నిఖిల్ ని బాగా ఇబ్బంది పెట్టింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈనెలలో రిలీజవుతోంది. తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరం. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్. ఒక జర్నలిస్టు జీవితంలో అనూహ్య సంఘటన... అటుపై దాని నుంచి కంబ్యాక్ అయ్యేందుకు తనని తాను నిర్ధోషి అని నిరూపించుకునేందుకు ఎలాంటి పాట్లు పడ్డాడు? అన్నదే ఈ సినిమా కథాంశం. 13 కోట్ల స్కాం.. దొంగ సర్టిఫికెట్లు వంటి ఇంట్రెస్టింగ్ టాస్క్ ని దర్శకుడు  టి.ఎన్.సంతోష్ ఎంపిక చేసుకున్నాడు. సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ అర్జున్ సురవరంగా నటించాడు. దొంగ సర్టిఫికేట్స్ నేపథ్యంలో టాస్క్ కి కోట్లాది రూపాయల స్కామ్ కి లింక్ ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఇందులో విలన్ల గ్యాంగ్ అరాచకాల్ని సురవరం ఎలా బయట పెట్టాడు? అన్నది తెరపైనే చూడాలి.

ట్రైలర్ ఆకట్టుకుంది. అయితే ట్రైలర్ లో ఉన్నంత మ్యాటర్ గ్రిప్ సినిమా ఆద్యంతం ఉంటే ప్రేక్షకాదరణ బావుంటుంది. ఎట్టి పరిస్థితిలో నిఖిల్ హిట్టు కొట్టాల్సిన టైమ్ లో వస్తున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండనుంది అన్నది చూడాలి. నిఖిల్ ఇన్నాళ్ల వెయిటింగ్ .. నవతరం దర్శకుడు సంతోష్ కి ఇన్నాళ్ల వేదన తీరాలంటే ఘనవిజయం చాలా ఇంపార్టెంట్.