అర్జున్ రెడ్డి బ్యూటీ.. చెప్పకుండా ఎక్కడికో తీసుకెళ్లారట!

Sat Sep 24 2022 17:00:01 GMT+0530 (India Standard Time)

Arjun Reddy beauty.. He took him somewhere without telling me!

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా తెలుగు పరిచయమైన శాలిని పాండే మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఆమెకు దక్కిన క్రేజ్ మాత్రం ఆ ఒక్క సినిమాతోనే.ఆ తర్వాత ఎన్ని విభిన్నమైన పాత్రలు చేసినా కూడా బ్యూటీకి స్టార్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కలేదు. అలాగే గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నట్లు సోషల్ మీడియాలో తరచుగానే బికినీ అందాలతో కూడా షాక్ ఇచ్చింది.

కానీ ఎంత గ్లామరస్ గా కనిపించిందో కూడా షాలిని పాండే అనుకున్నట్లుగా పెద్ద హీరోల సినిమాలలో మాత్రం ఆఫర్లు దక్కడం లేదు. ఇక పెద్ద సినిమాలు ఆఫర్లు రాకపోయినా చేస్తున్న సినిమాలు సక్సెస్ కాకపోయినా కూడా ఈ బ్యూటీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తన ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. నిత్యం ఏదో ఒక సినిమాతో కలిపిస్తూనే ఉంది. అలాగే సోషల్ మీడియాలో కూడా హడావిడి చేస్తూ ఫాలోవర్స్ దృష్టిని తన వైపు పడేలా చేసుకుంటోంది.

ఇక రీసెంట్ గా అర్జున్ రెడ్డి బ్యూటీ తన సోదరితో కలిసి ఒక ప్రత్యేకమైన బర్త్ డే సెలబ్రేషన్ చేసుకున్నట్లుగా వివరణ ఇచ్చింది. అయితే ఆ సమయంలో ఆమె స్నేహితులు సన్నిహితులు అందరూ కలిసి వెంటనే బ్యాగ్ సర్దుకోవాలి అని ఒక తెలియని ప్రదేశానికి వెళ్లబోతున్నాము అని అన్నారట. అయితే విమానశ్రయం వెళ్లే వరకు కూడా తనకు వెళుతున్న ప్రదేశం ఏమిటో కూడా తెలియని విధంగా సర్ ప్రైజ్ చేశారని అంది.

ఒక విధంగా అలాంటి సర్ప్రైజ్ టూర్స్ చాలా మంచివి అని కూడా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. ఇక కేవలం తెలుగులోనే కాకుండా శాలిని పాండే ఇతర ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అలాగే హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇక రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ కొన్ని మీడియం రేంజ్ సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.