అర్జున్ తన స్నేహితులందరితో పడుకున్నాడని చెప్పిన సోనమ్..!

Tue Aug 09 2022 16:42:03 GMT+0530 (IST)

Arjun Kapoor and Sonam Kapoor At Coffe With Karan Tv Show

బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న 'కాఫీ విత్ కరణ్' టాక్ షో సీజన్-7 సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కరణ్ ఎప్పటిలాగే సెలబ్రిటీ గెస్టులను తమ పర్సల్ లైఫ్ మరియు సెక్స్ లైఫ్ - ఎఫైర్స్ కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో 'కాఫీ విత్ కరణ్' టాక్ షో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పటి వరకు రణవీర్ సింగ్ - అలియా భట్ - జాన్వీ కపూర్ - సారా అలీఖాన్ - సమంత - సమంత - విజయ్ దేవరకొండ - అనన్య పాండే - అమీర్ ఖాన్ - కరీనా కపూర్ ఖాన్ వంటి స్టార్స్ సందడి చేశారు.

కరణ్ KWK నెక్స్ట్ ఎపిసోడ్ కు బాలీవుడ్ సిబ్లింగ్స్ అర్జున్ కపూర్ మరియు సోనమ్ కపూర్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో మీ బ్రదర్ నీకున్న స్నేహితుల్లో ఎంత మంది పడుకున్నాడు? అని అర్జున్ ని ఉద్దేశిస్తూ సోనమ్ ని ప్రశ్నించాడు కరణ్.

దీనికి సోనమ్ కపూర్ స్పందిస్తూ.. "నేను దాని గురించి చర్చించడం లేదు.. నా సోదరుల మధ్య ఎవరూ మిగలలేదు" అని బదులిచ్చింది. నిజానికి సోనమ్ స్నేహితులు చాలా మందితో ఆమె కజిన్ అర్జున్ కపూర్ మరియు సోదరుడు హర్షవర్ధన్ కపూర్ తో డేటింగ్ చేశారు. ఈ నేపథ్యంలో కరణ్ ప్రశ్న అడగ్గా.. ఎవరూ మిగల్లేదని తెలిపింది.

దాంతో కరణ్ పగలబడి నవ్వుతూ.. ‘నువ్వు ఎలాంటి బ్రదర్ వి?’ అని అన్నాడు. దీనికి అర్జున్.. సోనమ్ ను చూపిస్తూ “నువ్వు ఎలాంటి సోదరివి? మా గురించి ఏమి చెబుతున్నావు. సోనమ్ చేత ట్రోల్ చేయించడానికే నన్ను ఈ షోకి పిలిచినట్లు అనిపిస్తుంది” అని అన్నాడు.

ఇకపోతే అర్జున్ కపూర్ ప్రస్తుతం తనకన్నా వయసులో చాలా పెద్దదైన సీనియర్ నటి మలైకా అరోరాతో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మలైకా గురించి ప్రస్తావిస్తూ అర్జున్ తన ఫోన్ లో ఆమె పేరును ఎలా సేవ్ చేసుకున్నావ్? అని అడిగాడు కరణ్.

దీనికి అర్జున్ స్పందిస్తూ.. "నాకు ఆమె పేరు చాలా ఇష్టం.. మలైకా అనే సేవ్ చేసుకున్నా" అని బదులిచ్చాడు. సోనమ్ తన మీద కోపం వచ్చే ఒక విషయం గురించి చెప్పమని అడగ్గా.. "ఎవరూ నీకు కాంప్లిమెంట్ ఇస్తారని నువ్వు వేచి ఉండవు. నీకు నువ్వే పొగడ్తలు ఇచ్చుకుంటావ్" అని అర్జున్ చెప్పాడు. రణబీర్ కపూర్ ను ఉద్దేశిస్తూ సోనమ్ కొన్ని జోక్స్ వేయడం ప్రోమోలో కనిపిస్తుంది.

సోనమ్ కపూర్ - అర్జున్ కపూర్ ఎలాంటి సంచలన విషయాల గురించి చర్చించారో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. 'కాఫీ విత్ కరణ్' టాక్ షో 6వ ఎపిసోడ్ డిస్నీ+ హాట్ స్టార్ లో ఈ గురువారం మధ్యాహ్నం 12:00 గంటల నుండి ప్రసారం కానుంది.