ఐశ్వర్యా అర్జున్ థై షో దుమారం!

Sat Aug 13 2022 15:20:41 GMT+0530 (IST)

Aishwarya Arjun shows Thai Beauty In A denim Skirt

యాక్షన్ కింగ్ అర్జున్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన ఐశ్వర్యా అర్జున్ సుపరిచితమే. స్టార్ కిడ్ గా అమ్మడు పదేళ్ల క్రితమే మేకప్ వేసుకుంది. ఓ తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది గానీ నటిగా అక్కడంత సక్సెస్ అవ్వలేదు. అటు ఓ కన్నడ సినిమాలోనూ నటించింది. అక్కడా అదే పరిస్థితి.  కన్నడ..తమిళ ఇండస్ర్టీలో అర్జున్ కి ఎంత గుర్తింపు ఉన్నా? ఆ క్రేజ్ కుమార్తె విషయంలో ఎక్కడా కలిసి రాలేదు.దీంతో లాభం లేదనుకున్న  అర్జున్ ఇటీవలే టాలీవుడ్ లో కూడా లాంచ్ చేసాడు. విశ్వక్ సేన్ హీరో గా తానే స్వీయా దర్శకత్వంలో ఇక్కడో సినిమా నిర్మిస్తున్నారు. ఆ చిత్రంలో ఐశ్వర్యనే హీరోయిన్ గా తీసుకున్నారు.

కుమార్తె ఎంట్రీ కోసమే ఇక్కడ సినిమా చేస్తున్నారు  అన్న రూమర్ ఉంది. మరి ఇక్కడైనా అర్జున్ సహా అమ్మడి డ్రీమ్ ఫుల్ ఫిల్ అవుతుందా?  లేదా? అన్నది కొన్నాళ్లు ఆగితే గాని తెలియదు.

ఇక అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటుంది. అయితే గ్లామర్ షోకి అంతగా ప్రాధాన్యత  ఇవ్వదు. చాలా రేర్ గానే అందాల ప్రదర్శనకు పూనుకుంటుంది. తాజాగా అమ్మడి కొత్త  ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో ఐశ్వర్య  డెనిమ్ స్కర్ట్  లో థై అందాల ప్రదర్శన హైలైట్ గా నిలిచింది.  మ్యాచింగ్  టాప్ లో గ్రీన్ కలర్ బనియన్ లో యువతని అట్రాక్ట్ చేసే ప్రయత్నం  చేసింది.

సోఫాలో అమ్మడి భంగిమలు హైలైట్. అర్జున్ లానే కుమార్తె సైతం డాగ్స్ కి  మంచి నేస్తంలా కనిపిస్తుంది. వాటి మధ్యలోనూ కొన్ని ఫోటోలకు ఫోజులిచ్చింది.  

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అమ్మడి ముఖంలో ఎంతో సంతోషం కనిపిస్తుంది. ఆనందం ఆమెకు చాలా అందంగా కనిపిస్తుంది. మరి  అందరూ  దానిని అంగీకరించలమా?  లేదా? అన్నది అభిమానుల రెస్పాన్స్ బట్టి ఉంటుంది.