టీజర్: ఆర్జీవీతో అరియానా మరీ ఇంత వేడిగానా?

Fri Jun 18 2021 10:18:02 GMT+0530 (IST)

Ariyana Talks Bold With RGV

గత కొంతకాలంగా సోషల్ మీడియాల్లో ఆర్జీవీతో బిగ్ బాస్ బ్యూటీ అరియానా ఎపిసోడ్స్ ఎంత వైరల్ గా మారాయో చూస్తున్నదే. తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అరియానాతో జిమ్ చేయించిన ఘనుడు ఆర్జీవీ అంటూ ప్రచారం హోరెత్తిపోతోంది.అరియానాతో ఆర్జీవీ ఘాటైన ఫోజులు జిమ్మింగ్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. వీటిపై యువతరం డిబేట్ తెలిసినదే. ఇక తాజాగా `అరియానా టాక్స్ బోల్డ్ విత్ ఆర్జీవీ` టీజర్ ని రిలీజ్ చేసారు. ఇక ఇందులో మాటలేవీ లేవ్. కేవలం నేపథ్య సంగీతం జిమ్ లో ఆ ఇద్దరి కుస్తీల విజువల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక టైట్ ఫిట్ స్పోర్ట్ డ్రెస్ లో అరియానా అందాల కవ్వింత.. దానికి తోడు ఆర్జీవీ దగ్గరుండి జిమ్ చేయించే ఎపిసోడ్స్ ఒక్కసారిగా వేడి పెంచేస్తున్నాయి. ఇక అరియానా నాభి అందాలు సన్నజాజి నడుముపైనే ఆ కెమెరాకు ఫోకస్ ఎక్కువ! అన్న తీరుగా ఆ విజువల్స్ కుర్రాళ్ల గుండెల్లో మంటలు పెట్టేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

``హే అరియాన నువ్వు ఇచ్చిన బోల్డ్ ఇంటర్వ్యూ టీజర్ విడుదలకు ఆలస్యమైనందుకు క్షమించు. సాంకేతిక లోపం వల్ల విడుదల చేయడం కుదరలేదు. ఈ రోజు రాత్రి 9:30 గంటలకు ఈ టీజర్ ను విడుదల చేస్తున్నాం`` అంటూ ఆర్జీవీ ట్వీట్ చేయడమే గాక టీజర్ ని లాంచ్ చేయగా అది వైరల్ గా మారింది.