బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న మన సినిమాలివే?

Sun Jan 30 2022 06:00:01 GMT+0530 (IST)

Are there any silent movies being remade in Bollywood

`బాహుబలి` తరువాత దేశ వ్యాప్తంగా మన సినిమాలపై ఫోకస్ పెరిగింది. హాలీవుడ్ మేకర్స్ సైతం టాలీవుడ్ లో ఏ సినిమా మొదలవుతుందా? అని ఆసక్తిని చూపిస్తున్నారంటే మన టాలీవుడ్ క్రేజ్ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇక బాలీవుడ్ మేకర్స్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. ఉత్తరాది ప్రేక్షకులు బోర్ ఫీలైన ప్రతీసారి మన సినిమాలని రీమేక్ చేసి మరీ బ్లాక్ బస్టర్ లని సొంతం చేసుకోవడం అలవాటుగా మారింది. అది ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది.ఎంతలా అంటే మన దగ్గర బ్లాక్ బస్టర్ లుగా నిలిచిన చిత్రాలని వరుసగా రీమేక్ లు చేసుకునేంత. ఇప్పడు దక్షిణాది నుంచి ఉత్తరాదిలో రీమేక్ అవుతున్న క్రేజీ సినిమాలు చాలానే వున్నాయి. సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ `అర్జున్ రెడ్డి`ని హిందీలో `కబీర్‌సింగ్` పేరుతో రీమేక్ చేస్తే అది అక్కడ కూడా రికార్డుల మోత మోగించడంతో పాటు హీరో షాహీద్ కపూర్ మార్కెట్ ని 10 కోట్ల నుంచి 30 కోట్లకు పెంచేసింది.

ఈ సినిమా తరువాత షాహీద్ కపూర్ తన రెమ్యునరేషన్ ని 30 కోట్లకు పెంచేశాడు. ఆ కారణంగా ఈ రీమేక్ తరువాత బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ కోలీవుడ్ రీమేక్ లపై ప్రత్యేక ఆసక్తిని చూపించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం బాలీవుడ్ లో మన సినిమాలు ఏవేవి రీమేక్ అవుతున్నాయో ఒక లుక్కేద్దాం.

2005లో తెలుగు తమిళ భాషల్లో సంచలనం సృష్టించిన చిత్రం `అన్నియన్` (అపరిచితుడు). ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని స్వయంగా శంకరే డైరెక్ట్ చేయబోతున్నాడు. పెన్ స్టూడియోస్ ఇండియా బ్యానర్ పై డా. జయంతిలాల్ గడ నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి వుంది. రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న కారణంగా శంకర్ ఈ మూవీ తరువాతే `అన్నియన్` హిందీ రీమేక్‌ని సెట్స్ పైకి తీసుకెళతారట.

బన్నీ నటించిన క్రేజీ బ్లాక్ బస్టర్ `అల వైకుంఠపురములో` కూడా రీమేక్ అవుతోంది. `షెమజాదా` పేరుతో రీమేక్ అవుతున్న ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది విడుదల చేయాలని హీరో కార్తీక్ ఆర్యన్ గట్టి పట్టుదలతో వర్క్ చేస్తున్నాడు. మలయాళ హిట్ ఫిల్మ్ `డ్రైవింగ్ లైసెన్స్` ని కూడా రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. 2019లో వచ్చిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించాడు.

విశ్వక్ సేన్ నటించిన ఇంటెన్స్ కాప్ డ్రామా `హిట్`. ఈ చిత్రాన్ని రూపొందించిన శైలేష్ కొలను హిందీ రీమేక్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. రాజ్ కుమార్ రావు సాన్యా మల్హోత్రా జంగటా నటిస్తున్నారు. వచ్చే ఏడాది మే 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే బాటలో కార్తి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `ఖైదీ` కూడా రీమేక్ అవుతోంది. ఇందులో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు.

విజయ్ `మాస్టర్` రీమేక్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇక `విక్రమ్-వేద` ఇప్పటికే రీమేక్ షూటింగ్ మొదలైంది. హృతిక్ రోషన్ - సైఫ్ అలీఖాన్ ఇందులో నటిస్తున్నారు. ఇటీవలే హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. రాధిక ఆప్టే కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇవేకాక మరి కొన్ని చర్చలు దశలో వున్నాయి.