డైరెక్టర్ ని పెళ్లాడుతున్న హీరోయిన్

Mon Feb 11 2019 22:19:25 GMT+0530 (IST)

Are Farhan Akhtar and Shibani Dandekar all set to get married?

గత కొంతకాలంగా బాలీవుడ్ ని రకరకాల ఎఫైర్లు వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మలైకా అరోరాఖాన్ - అర్జున్ కపూర్ ఎఫైర్ ఖడ్గం ఫేం కిమ్ శర్మ - హర్షవర్ధన్ రాణే ఎఫైర్ గురించి హాట్ హాట్ గా మాట్లాడుకుంటోంది యూత్. దీంతో పాటే కుర్రభామ ఆలియాతో రణబీర్ కపూర్ ప్రేమాయణంపైనా అంతే వాడి వేడిగా చర్చ సాగుతోంది. త్వరలోనే ఈ జోడీ పెళ్లికి రెడీ అవుతున్నారని పక్క పక్క ఫ్లాట్ లో ఉంటున్నారని ప్రచారమవుతోంది. ఈ టైమ్ లో మరో కొత్త ఎఫైర్ అంతే ఇదిగా ఫిలింసర్కిల్స్ లో చర్చకొచ్చింది.ఈసారి ముదురు వయసు డైరెక్టర్ కం హీరో ఫర్హాన్ అక్తర్ (48) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఫర్హాన్ ప్రస్తుతం సింగర్ కం నటి శిబానీ దండేకర్ తో డీప్ గా ప్రేమలో మునిగాడు. మునగడమే కాదు తన ప్రేయసిపై కవితలు అల్లుతున్నాడు. తన ప్రియుడి కవితాత్మక హృదయానికి స్పందనగా ఆ ప్రేయసి అంతే ఇదిగా రిటర్న్ గిఫ్టులు ఇస్తోంది. తాను కూడా కవితలు అల్లేస్తూ అసలు విషయం చెప్పేసింది. త్వరలోనే మేం  పెళ్లికి రెడీ అవుతున్నాం అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా లీక్ చేసింది. అందుకు ఫర్హాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. 2018లో కెనడా ట్రిప్ కి కలిసి వెళ్లిన ఈ జంటపై అప్పటి నుంచే రూమర్లు ఉన్నాయి. ఇన్నాళ్టికి కాయ పండు అవుతోంది.

తాజాగా ఇన్ స్టాలో ఫర్హాన్ - శిబానీ (37) జంట సన్నిహితంగా ఉన్న ఫోటోని పోస్ట్ చేయడమే గాక.. దానికి `వెడ్డింగ్ వైబ్స్` అని కామెంట్ చేయడంతో ఇక ఈ జోడీ పెళ్లితో ఒకటి కాబోతున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే ఫర్హాన్ ఇప్పటికే వైఫ్ కి విడాకులిచ్చి యంగ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో జోరుగా ఎఫైర్ సాగించాడు. అయితే ఆ ఇద్దరి మధ్యా ఏమైందో ఇటీవల బ్రేకప్ అయ్యి దూరంగా ఉంటున్నారు. తాజాగా శిబానీ తన లైఫ్ లో ప్రవేశించడం.. అటుపై పెళ్లి వరకూ వెళ్లడంపై వేడెక్కించే చర్చ సాగుతోంది. జీవితం అలా అలా ముందుకు సాగుతుంటుంది. దాని వెంట మనం వెళ్లాలి అంతే!! అంతేగా! అంతేగా!!