నా లైఫ్ నా ఇష్టం అనేది.. అందుకే విడిపోయాం

Fri Apr 19 2019 17:02:14 GMT+0530 (IST)

బాలీవుడ్ స్టార్ అర్భాజ్ ఖాన్ మరియు మలైకా అరోరాలు 2017లో అధికారికంగా విడిపోయిన విషయం తెల్సిందే. వీరిద్దరు విడాకులు తీసుకుని విడి విడిగా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే విడాకులకు కారణంపై ఇద్దరు కూడా ఇప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. ఆమద్య మలైకా అరోరా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తామిద్దరి మద్య ప్రతి రోజు గొడవ వస్తుండటంతో కలిసి ఉండటం కష్టం అని విడిపోయాం అంటూ చెప్పుకొచ్చింది. గొడవలు ఏ కారణం వల్ల వచ్చేవి అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.తాజాగా అర్భాజ్ ఖాన్ ఒక టాక్ షోలో మాట్లాడుతూ... మా ఇద్దరి మద్య ప్రతి రోజు ఏదో ఒక సమస్య వచ్చేది. మా సంబంధం రోజు రోజుకు సన్నగిల్లుతూ వచ్చింది. చిన్న సమస్యకు - గొడవకు కూడా ఆమె నా లైఫ్ నా ఇష్టం అన్నట్లుగా మాట్లాడేది. తన ఇష్టానుసారంగా ప్రవర్తించేది ఒక ఫ్యామిలీలో ఉన్నాను అనే విషయాన్ని ఆమె ఆలోచించకుండా తన లైఫ్ తన ఇష్టం అన్నట్లుగా వ్యవహరించడం వల్ల నాకు ఇబ్బందిగా అనిపించేది. భార్య భర్తల్లో ఎవరికైనా అలాంటి ఆలోచన వచ్చినప్పుడు కలిసి ఉండటంలో అర్థం లేదని తాను భావించాను. ఎవరి జీవితంను వారు గడపడం కోసం విడాకులు తీసుకున్నామని చెప్పుకొచ్చాడు.

యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమ కారణంగానే మలైకా అరోరా తరచు భర్తతో గొడవ పడేది అనే ప్రచారం జరిగింది. భర్తతో విడిపోయిన తర్వాత అర్జున్ కపూర్ తో మలైకా అధికారికంగానే తిరుగుతోంది. ఇద్దరు కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరగడంతో పాటు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి 19 ఏళ్ల వైవాహిక జీవితం సాగించిన అర్భాజ్ ఖాన్ మరియు మలైకా అరోరాలు విడిపోవడం రెండు వైపుల కుటుంబాలు మరియు పిల్లలకు ఇబ్బంది కలిగించిందని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.