ఎట్టకేలకు కుర్రహీరోని ఓటీటీ ఆదుకుంది

Tue Jul 20 2021 19:00:01 GMT+0530 (IST)

Aravinda Swamy sandeep combo movie in OTT

అరవింద స్వామి లాంటి బడా స్టార్ నటించిన సినిమా... అందులో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరో. కానీ ఎందుకనో ఈ సినిమా చాలాకాలంగా ల్యాబుకే అంకితమైంది. ఇన్నాళ్లు ఎందుకని రిలీజ్ ఆలస్యం ? అంటూ అంతా ప్రశ్నలు కురిపించారు. కానీ ఎట్టకేలకు ఓటీటీ వెసులుబాటుతో ఈ సినిమాకి మోక్షం కలిగింది. ఇంతకీ ఏదా సినిమా అంటే... నరగసూరన్. ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఈ తమిళ చిత్రం కోసం సందీప్ చాలానే శ్రమించారు. కానీ ఏం లాభం?  కోవిడ్ విలయం సహా ఆర్థిక కారణాలు కూడా రిలీజ్ ఆలస్యానికి కారణమైంది. ఎట్టకేలకు సినిమాని పూర్తి చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.నరగసూరన్ ఆగస్టు 13న డిజిటల్ స్క్రీన్లలోకి రానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం సోనీ లైవ్ లో ప్రీమియర్ అవుతుందని చెబుతున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నరగసూరన్ ట్రైలర్ 2018 లో తిరిగి విడుదలైంది. కానీ ఈ చిత్రం అనేక కారణాల వల్ల థియేటర్లలోకి రాలేదు. ప్రస్తుతం ఓటీటీ డీల్ కుదిరిందట.

ఈ చిత్రంలో శ్రీయ శరణ్- ఆత్మిక- ఇంద్రజిత్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం అతీంద్రియ శక్తుల నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. ఇటీవలి కాలంలో ఈ తరహా థ్రిల్లర్ రాలేదని చెబుతున్నారు. మరి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో కాస్త ఆగితే కానీ తెలీదు.