#స్టోర్ రూమ్ మెమరీస్.. మురుగదాస్ షాకింగ్ అవతార్

Thu Jun 10 2021 08:00:01 GMT+0530 (IST)

Ar Murugudoss Instagram Video Goes Viral

రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశం వస్తుందో చెప్పలేం. ఈ రంగంలో ఫలానాదే కావాలనుకుంటే దక్కదు. ఇక్కడ సమయం సందర్భాన్ని బట్టి కూడా ఫేట్ మారుతుంది. అయితే ఫలానా శాఖలో రాణించాలని డిసైడయ్యాక అందులో హార్డ్ వర్క్ చేస్తే ఆశించినది దక్కడం కష్టమేమీ కాదు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దానిలో సత్తా చాటితే కెరీర్ కి ఢోఖా ఉండదు.ఇక జాతీయ ఉత్తమ దర్శకుడిగా ఎన్నో విలక్షణ చిత్రాల్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ల దర్శకుడిగా పేరున్న ఏ.ఆర్.మురుగదాస్ తన కెరీర్ ని ప్రారంభించింది రచయితగా.. ఆ తర్వాత సహాయదర్శకుడయ్యారు. అయితే ఆ టైమ్ లో నటుడిగానూ ప్రయత్నించారు. తనకు ఆఫర్ చేసినది చిన్న పాత్రే అయినా ఎలాంటి భేషజానికి పోకుండా నటించాడు. అది కూడా హోటల్లో సర్వర్ పాత్ర. అబ్బాస్- సిమ్రన్ - నగేష్ లాంటి స్టార్లకు టీ సప్లయ్ చేసే సర్వర్ పాత్రలో మురుగదాస్ నటించారు. ఉదయ్ శంకర్ తెరకెక్కించిన పూచదవ లో సీన్ అది. ఆ సీన్ లో నీ పేరేంటి? అని అడిగితే  మురుగదాస్ అనే చెబుతాడు. ఇక సర్వర్ పాత్రే అయినా అతడు యుక్తవయసులో ఎంతో స్మార్ట్ గా ఉన్నాడు. హోటల్ స్టాఫ్ యూనిఫాంలో అతడు హీరోలా కనిపించాడు.

నిజానికి సినీరంగంలో హీరో అవ్వాలని కలలు కననిది ఎవరు? అవకాశం అదృష్టం వరిస్తే ఏదైనా అవ్వొచ్చు. కానీ మురుగదాస్ దర్శకత్వంలో పట్టు సాధించి ఇంతింతై స్టార్ డైరెక్టర్ గా పరిశ్రమనే శాసిస్తున్నారు. రజనీతో దర్బార్ తర్వాత అతడు విజయ్ లేదా అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ప్రయత్నించినా వీలుపడలేదు. అలాగే ఇస్మార్ట్ రామ్ తోనూ మురుగదాస్ ఓ చిత్రానికి సన్నాహకాల్లో ఉన్నారని తెలిసింది. స్టోర్ రూం మెమొరీస్ అంటూ మురుగ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.