అన్వేషీ అందాలు.. మాస్ రాజా మెరుపులు..

Sat Jul 02 2022 11:27:55 GMT+0530 (IST)

Anveshi Jain Party song with Ravi Teja

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. మాసీవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ ద్వారా శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్. ఎల్. వి సినిమాస్  ఆర్ టి టీమ్ వర్క్  బ్యానర్ ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీలో 'జైభీమ్' ఫేమ్ రజీషా విజయన్ దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన దగ్గరి నుంచి ఈ మూవీపై అంచనాలు మొదలయ్యాయి.  అయితే గత కొన్ని నెలలుగా వివిధ కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాల రిలీజ్ ల కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ రిలీజ్ పై ఇటీవల వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ చిత్ర బృందం మూవీ ని జూలై 29 న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. అంతే కాకుండా ఈ మూవీ ప్రమోషన్స్ ని కూడా జోరుగా ప్రారంభించేసింది. ఈ మూవీ ద్వారా హీరో తొట్టెంపూడి వేణు చాలా రోజుల తరువాత ఓ కీలక పాత్రతో రీఎంట్రీ ఇస్తున్నారు.

సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా లిరికల్ వీడియోలని విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పటికే రెండు లిరికల్ వీడియోలని విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా థర్డ్ సింగిల్ గా మాసీవ్ ఐటమ్ నంబర్ 'నా పేరు సీసా..' అంటూ సాగే లిరికల్ వీడియో ని రిలీజ్ చేస్తోంది. ఇటీవల ఈ సాంగ్ కి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా శనివారం ఫుల్ లిరికల్ వీడియో ని వదిలారు. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటని పాపులర్ సింగర్ శ్రేయా ఘోషల్ ఆలపించారు.

మాస్ మహారాజా రవితే. హాట్ లేడీ అన్వేషీ జైన్ లపై పార్టీ సాంగ్ గా ఈ పాటని చిత్రీకరించారు. హాఫ్ షర్ట్ ధరించి పంచకట్టులో మాస్ మహారాజా రవితేజ మెరుపులు మెరిపించారు. హాట్ లేడీ అన్వేషీ జైన్  తన అందాలతో అదరగొట్టేసింది. ఇద్దరి కెమిస్ట్రీకి ఈ పాట థియేటర్లలో విజిల్స్ వేయించేలా వుంది. చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటోంది. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందిస్తే సామ్ సీఎస్ సంగీతం అందించారు. శ్రేయా ఘోషల్ ఆలపించారు.

ఇప్పటి వరకు మెలోడీస్ ని విడుదల చేసి మేకర్స్ థర్డ్ సింగిల్ గా మాస్ మసాలా ఐటమ్ నంబర్ ని విడుదల చేయడం విశేషం. సామ్ సీఎస్ సంగీతం సత్యన్ సూర్యన్ ఫొటోగ్రఫీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. సినిమాలో హీరో రవితేజ డిప్యూటీ కలెక్టర్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీని చూసిన వర్మ కామెంట్ చేయడంతో ఈ మూవీపై రవితేజ ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్ తో వున్నారట.