విలన్ చేసిన డైరెక్టర్ తో హీరోగా కొత్త సినిమా..

Tue Jun 02 2020 21:30:58 GMT+0530 (IST)

Gopichand New Movie With teja

ప్రస్తుతం టాలీవుడ్ టాల్ హీరో గోపీచంద్.. కొత్త మూవీ 'సీటిమార్' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. 'గౌతమ్ నంద' మూవీ తర్వాత మరోసారి గోపీచంద్.. సంపత్ నంది డైరెక్షన్‌లో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా క్రీడా నేపథ్యంతో రూపొందుతుంది. ఇందులో ఫుల్‌బాల్ కోచ్‌గా గోపి కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత తన కెరీర్‌కు విలన్‌గా 'జయం' మూవీతో పెద్ద బ్రేక్ ఇచ్చిన తేజ డైరెక్షన్‌లో 'అలిమేలుమంగ వేంకటరమణ' అనే సినిమాను చేసేందుకు గోపి సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది చివరలో తేజతో సినిమా సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఇక ఈ సినిమాలో వేంకటరమణ క్యారెక్టర్‌ను గోపీ చేయనుండగా అలిమేలుమంగ పాత్రను ఎవరు చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ క్యారెక్టర్‌కు సంబంధించిన ఫిల్మ్‌నగర్‌లో ఇద్దరి పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి.వాస్తవానికి డైరెక్టర్ తేజ ఫస్ట్ కాజల్‌నే తీసుకుందామని భావించినట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఇంతవరకూ గోపీచంద్ - కాజల్ కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ఇటీవల వరుసగా 'నేనే రాజు నేనే మంత్రి' 'సీత' సినిమాలలో కాజల్‌నే తీసుకున్న తేజ.. ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో వార్త ఏంటంటే.. ఈ సినిమాలో మొదట కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నారట. అయితే కాజల్ తనంతట తానుగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట. అందువల్ల కాజల్ ప్లేస్ లో అనుష్కను హీరోయిన్గా తీసుకోవాలని తేజ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే లేడి ఓరియెంటెడ్ సినిమా కాబట్టి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తేజ భావిస్తున్నారట. ఇదివరకే గోపిచంద్-అనుష్క కాంబినేషన్లో 'లక్ష్యం' 'శౌర్యం' సినిమాలు మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా ఓకే అయితే వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ వచ్చే అవకాశం ఉందంటున్నాయి సినీవర్గాలు.