ఫోటో స్టొరీ: కోహ్లిగారి కుటుంబం...బీచ్ ఫన్

Wed Sep 11 2019 15:47:04 GMT+0530 (IST)

Anushka and Virat Kohli Selfie in Beach

ఇండియాలోని సెలబ్రిటీ కపుల్స్ లో అందరికంటే ముందుగా జనాలకు గుర్తుకువచ్చేది విరాట్ కోహ్లి - అనుష్క శర్మ జోడీనే.  ఇంకా చాలామంది ఉంటారు కానీ వీరిద్దరి కాంబినేషన్ యమా పవర్ఫుల్.  విరాట్ క్రికెట్ లో ఒక సూపర్ స్టార్.  ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న క్రికెటర్.  అనుష్క కూడా విరాట్ కు ఏమీ తీసిపోదు.  బాలీవుడ్ లో టాప్ లీగ్ స్టార్ హీరోయిన్లలో అనుష్క ఒకరు.  ముగ్గురు ఖాన్లతో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన ఘనత ఆమె సొంతం.  క్రికెట్.. సినిమా అనేది డెడ్లీ కాంబో.ఇద్దరినీ అభిమానులు విరుష్క అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ జంట రీసెంట్ గా హాలిడే వెకేషన్ నుండి ముంబై కి తరిగి వచ్చారట. అయితే విరాట్ తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి క్యాప్షన్ గా లవ్ ఎమోజి పెట్టాడు. ఈ ఫోటోలో బీచ్ లో విరాట్ - అనుష్క జంట చిల్ అవుట్ అవుతూ ఉన్నారు. విరాట్ స్వయంగా ఈ సెల్ఫీని తీసుకోవడం విశేషం. రిలాక్సింగ్ చెయిర్లో అనుష్క కూర్చుని ఉంటే.. ఆమె ఒడిలో పడుకొని ఓ ఫన్నీ ఎక్స్ ప్రెషన్ ఇస్తూ విరాట్ సెల్ఫీ కి పోజిచ్చాడు. ఇక అనుష్క కూడా విరాట్ ను హగ్ చేసుకొని ఒక చేతిని తన గడ్డం కింద పెట్టుకొని ఫోటోకు పోజిచ్చింది.  ఫోటో మాత్రం అదిరిపోయింది.  అయితే ఈ ఫోటో తమ ఫారెన్ వెకేషన్ లో తీసిన ఫోటోనా లేకా ఇండియాలో మరో బీచ్ లొకేషన్లో తీసుకున్న కొత్త ఫోటోనా అనేది మాత్రం తెలియదు.

ఇన్స్టాలో ఈ ఫోటో కు రెస్పాన్స్ అదిరిపోయింది. మూడు గంటల్లోనే రెండు మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. అలియా భట్ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ఫోటోకు ఓ లైక్ వేసుకున్నారు. "స్వీటెస్ట్ కపుల్".. "టుస్సాడ్స్ లో పెట్టాలి".. "బెస్ట్ కపుల్ ఇన్ బీచ్" అంటూ పొగడ్తలు కురిపించారు.