పురుషులందరికి కృతజ్ఞతలు : అనుష్క

Wed Mar 09 2022 12:20:30 GMT+0530 (India Standard Time)

Anushka Sheety wishes on womens day

బాహుబలి స్టార్ అనుష్క కొత్త సినిమాల విషయంలో అభిమానులకు కోపం తెప్పిస్తుంది. గత అయిదు సంవత్సరాల కాలంలో ఆమె నుండి వచ్చిన సినిమాలు భాగమతి మరియు నిశబ్దం మాత్రమే. ఈ రెండు సినిమాలు యావరేజ్ టాక్ నే దక్కించుకున్నాయి. అయినా కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ అయ్యాయి. యావరేజ్ సినిమాలు కమర్షియల్ హిట్ అయ్యాయి అంటే అనుష్క క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.అంతటి క్రేజ్ ఉండి.. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ కు సరిపోయే స్టార్ డమ్ ఉన్న అనుష్క సినిమాలను బ్యాక్ టు బ్యాక్ చేయకుండా జనాలను విసిగిస్తుంది అంటూ విమర్శలు వస్తున్నాయి. ఎవరు ఏం అనుకున్నా... ఎంత అనుకున్నా కూడా తాను చేయాలనుకున్నది చేస్తూ తాను అనుకున్నట్లుగా ఉంటు ముందుకు సాగుతున్న అనుష్క తాజాగా ఉమెన్స్ డే సందర్బంగా పోస్ట్ చేసిన ఒక విషయం చర్చనీయాంశంగా మారింది.

ఉమెన్స్ డే సందర్బంగా హీరోయిన్స్ అంతా కూడా స్పందించారు. అందరిలా అనుష్క కూడా సోషల్ మీడియా ద్వారా మహిళలకు శుభాకాంక్షలు చెప్పింది. అందరిలా సింపుల్ గా చెప్పేస్తే ఆమె గురించి మనం మాట్లాడుకోవడానికి ఏమీలేదు. కాని ఆమె తన పోస్ట్ లో మగవారు అందరికి కూడా ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సమయంలో ఆడవారి అన్ని పనుల్లో కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు గాను అనుష్క కృతజ్ఞతలు చెప్పిందనే టాక్ వస్తుంది.

ఇంకా తన పోస్ట్ లో.. ప్రతి ఒక్క మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వృతి పరంగా ప్రతి ఒక్కరు ఒక అద్బుతమైన మహిళగా పేరు దక్కించుకోవాలి. శారీరక మానసిక రుగ్మతలు అన్నింటిని బయటకు నెట్టివేయండి. వాటి వల్ల మీరు బయటకు పరుగులు తీయడం మానేయండి. మీ జీవితం ను మీరు గౌరవించుకుంటూ ఎదగండి. మీ భర్త.. సోదరుడు.. తండ్రి ఇలా ఎవరైనా మీ జీవితంలో బలంగా ఉంటే వారికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి అంది.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే నిశబ్దం సినిమా తర్వాత అనుష్క చేయబోతున్న సినిమా విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు ఎలాంటి హడావుడి లేకపోవడంతో అసలు అనుష్క ఇండస్ట్రీలో ఉన్నట్లా? లేనట్లా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆమె ఓకే అనాలే కాని ఏడాదికి రెండు మూడు సినిమాలు అయినా ఆఫర్లు వస్తాయి. ఏడాదికి పది కోట్ల సంపాదన అంటే పారితోషికం ఆమెకు వస్తుంది. కాని ఆమె డబ్బు కోసం సినిమాలు చేయాలని భావించడం లేదు.