Begin typing your search above and press return to search.

వార‌సురాలితో అనుష్క సంబ‌రాలు ఇలా

By:  Tupaki Desk   |   14 Oct 2021 11:30 PM GMT
వార‌సురాలితో అనుష్క సంబ‌రాలు ఇలా
X
విరాట్ కొహ్లీ -అనుష్క శ‌ర్మ జంట ఫ్యామిలీ లైఫ్ సెల‌బ్రేష‌న్ తెలిసిన‌దే. ఈ దంప‌తుల‌కు ఇటీవ‌ల పాపాయి జ‌న్మించ‌డంతో ఫ్యామిలీ లైఫ్ కే ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు. కుమార్తెతో క‌లిసి ఆడుకుంటోన్న ఎన్నో ఫ‌న్నీ మూవ్ మెంట్స్ ని విరుష్క సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసారు. బేబి వామికకు జ‌న‌వ‌రిలో విరుష్క జోడీ వెల్ కం చెప్పారు. ఆరు నెల‌ల వ‌య‌సుకి 6 మంథ్ బ‌ర్త్ డేని కూడా విరుష్క జంట గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసింది. ప‌సిపాపాయి కేరింత‌లు న‌డుమ కేక్ క‌ట్ చేస్తూ ఇంట్లోనే వేడుకను సింపుల్ గా జ‌రుపుకున్నారు.

అటుపై ఎప్ప‌టిక‌ప్పుడు వామిక ఫోటోల్ని ఇన్ స్టా వేదిక‌గా అనుష్క‌శ‌ర్మ అభిమానుల‌కు షేర్ చేస్తూ వారిని సంతోష పెడుతున్నారు. తాజాగా వామిక‌తో అనుష్క శ‌ర్మ కొత్త ఫోటోని షేర్ చేసింది. వామిక క్రీమ్ క‌ల‌ర్ డ్రెస్ ధ‌రించ‌గా..అనుష్క టీ ష‌ర్ట్ ధ‌రించింది. ఇద్ద‌రు హాలీడేస్ సంద‌ర్భంగా ఆట‌పాట‌ల‌తో ఉన్న‌ మూవ్ మెంట్స్ ని షేర్ చేసింది. ఇక చిన్నారి అనుష్క ఒడిలో వాలిపోతే త‌ల్లి మ‌న‌సు ఎంత ఉప్పోంగిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. `ప్ర‌తీ రోజు ధైర్యంగా ముందుకు సాగుతున్నానంటే దానికి కార‌ణం నా చిన్నారే` అంటూ అనుష్క ఓ క్యాప్ష‌న్ ఇచ్చింది. `నా చిన్న దేవత నాకిచ్చే సంతోషం ముందు ఏదైనా చిన్న‌దే..! అంటూ సంబ‌ర‌ప‌డింది.

`` పాపాయి చిరున‌వ్వు మ‌న ప్ర‌పంచం మొత్తాన్ని మార్చ‌గ‌ల‌దు.. నువ్వు మా వైపు చూసే ప్రేమ‌తోనే ఇద్ద‌రం జీవించ‌గ‌లం`` అంటూ అనుష్క పోస్ట్ చేసింది. మొత్తానికి వామిక- విరుష్క ఇంట సంతోషాల వెల్లువ అని చెప్పొచ్చు. ఏడాది పూర్త‌యితే మొద‌టి బర్త్ డేని గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేయడానికి దంపతులిద్ద‌రు ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. పాపాయి జ‌న్మించిన ఆరు నెల‌ల బ‌ర్త్ డేని ధూమ్ ధామ్ అనిపించేలా చేసారంటే? ఏడాది పూర్త‌యితే ఇంకే రేంజ్ లో సెల‌బ్రేట్ చేస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం విరుష్క ఇంట దుర్గామాత పూజ‌లు ద‌స‌రా సంబ‌రాలు మిన్నంటాయి.

త‌ల్లి అయినా మార్పు రాలేదు!

బాలీవుడ్ అందాల క‌థానాయిక అనుష్క శ‌ర్మ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చినా గ్లామ‌ర‌స్ డాళ్ గానే అభిమానుల గుండెల్లో వెలిగిపోతోంది. బెబో త‌ర‌హాలోనే అనుష్క ఇమేజ్ ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌లేదు. అనుష్క‌- విరాట్ జంట త‌మ కుమార్తెకు వామిక అని నామ‌క‌ర‌ణం చేయా.. ఇప్ప‌టికే కిడ్ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి.

మ‌రోవైపు అనుష్క శ‌ర్మ తిరిగి సినిమాల్లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే న‌ట‌న‌లో ఎంట్రీకి ఇంకా చాలా స‌మ‌యం ఉన్నా నిర్మాత‌గా సినిమాల్ని ప్రారంభించ‌నున్నార‌ట‌.

అనుష్క స్వ‌త‌హాగానే ఫిట్నెస్ ఫ్రీక్. జిమ్ - యోగా అంటూ నిరంత‌రం సెష‌న్స్ ని మిస్ చేయ‌దు. న‌ట‌న‌తో ప‌ని లేకుండానే ఇప్ప‌టికే త‌న రూపురేఖ‌ల్ని మార్చుకునే ప్ర‌య్నం చేస్తోంది. ఇటీవ‌ల అనుష్క శ‌ర్మ మునుప‌టి రూపానికి చెందిన మేకోవ‌ర్ పైనా చ‌ర్చ సాగింది. త్వ‌ర‌లోనే న‌టిగా రీఎంట్రీకి సంబంధించిన మూవీ ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని అభిమానులు వేచి చూస్తున్నారు.

కోహ్లీపై సీనియ‌ర్ల‌ విమ‌ర్శ‌లు

మ‌రోవైపు విరాట్ కోహ్లీ టీ-20 ల్లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ టీమ్ ని గెలిపించ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాడంటూ మైఖేల్ వాన్ వంటి నిపుణులు విమ‌ర్శించ‌డం ఇటీవ‌ల చ‌ర్చ‌కు వ‌చ్చింది. కోహ్లీ ఆర్.సి.బి టీమ్ బెస్ట్ ఆట‌గాళ్ల‌తో ఉన్నా కానీ విజ‌యాలు అందుకోవ‌డం లేద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. అయితే వీట‌న్నిటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కోహ్లీ ఫ్యామిలీ మ్యాన్ లైఫ్ ఉప‌క‌రిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.