బాబోయ్ బికినీతో సెగలు రేపుతోంది.. ఎవరీ సుందరి!

Sat Jul 11 2020 16:03:58 GMT+0530 (IST)

Anushka Sharma raising Heat

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ. ప్రస్తుతం 'బ్యూటీ విత్ బ్రెయిన్' అని సినీప్రియులు పిలుచుకుంటున్నారు. ఎందుకంటే అనుష్క హీరోయిన్.. అనుష్క ఒక స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. అంతేగాక అనుష్క ఒక టాలెంటెడ్ ఫిల్మ్ అండ్ వెబ్ సిరీస్ ప్రొడ్యూసర్. మోడలింగ్ రంగం నుండి వచ్చిన అనుష్క తన సినీ కెరీర్లో ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించింది. అందుకే అమ్మడి ఖాతాలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. అయితే మోడలింగ్ రంగంలో మ్యాగజైన్స్ కోసం ఎన్ని అందాలు ఆరబోసిందో సినిమాల్లోకి వచ్చాక అమ్మడు అంతకుమించి అందాల ప్రదర్శన చేసేసింది. ఇంకా చేస్తూనే ఉందని తాజా మ్యాగజైన్ ఫోటోలు చూస్తే తెలుస్తుంది. అమ్మడు ధరించని ఫ్యాషన్ దుస్తులు లేవంటే నమ్మాలి. చీరకట్టు నుండి టూ పీస్ బికినీ వరకు అన్నీ అనుష్కకి కామన్. ఇక విరాట్ కోహ్లీతో పెళ్లి అయిన తర్వాత ఈ భామ అందాల ప్రదర్శనకు కాస్త అడ్డుగోడ కట్టుకుందని చెప్పాలి. కాకపోతే సినిమా ఫీల్డ్ మాత్రం వదలలేదు.ఇప్పటికి సినిమాకోసం ఏదైనా చేస్తుంది ఈ భామ. సినీ ఇండస్ట్రీనే ప్రపంచం అంటోంది. అలా హీరోయిన్ అయి స్టార్డం అందుకుందో లేదో అమ్మడు సినీ నిర్మాణ రంగం వైపు కూడా అడుగులు వేసింది. అందులో కూడా సక్సెస్ అందుకుంది. రీసెంట్ గా 'పాతాళలోక్' అనే వెబ్ సిరీస్ నిర్మించి హిట్ అందుకుంది. కొంతకాలంగా అనుష్క తెరమీద తక్కువగా కనిపిస్తుంది. అభిమానులు అనుష్క అందాలను చాలా మిస్ అవుతున్నారట. అయితే అనుష్క ఇంట్లో ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ వోగ్ మ్యాగజైన్ కోసం దిగిన పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడు టూ పీస్ బికిని వేసుకొని అలా పోజు పెట్టింది. ఎల్లో కలర్ స్వేటర్ ధరించి.. బికినిలో సెగలు పుట్టిస్తోంది. ఆ ఫోటోలో అమ్మడి అందాలను చూసిన నెటిజన్లు మతులు పోతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.