Begin typing your search above and press return to search.

నిర్మాతగా బిజీ అయిన స్టార్ హీరోయిన్.. మళ్లీ తెరపై కనిపిస్తుందా..??

By:  Tupaki Desk   |   12 Aug 2020 2:30 AM GMT
నిర్మాతగా బిజీ అయిన స్టార్ హీరోయిన్.. మళ్లీ తెరపై కనిపిస్తుందా..??
X
స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో 'బ్యూటీ విత్ బ్రెయిన్' అని పిలుచుకుంటున్నారు. ఎందుకంటే అనుష్క ఒక స్టార్ హీరోయిన్.. అలాగే ఒక స్టార్ క్రికెటర్ భార్య. మోడలింగ్ రంగం నుండి వచ్చిన అనుష్క తన సినీ కెరీర్లో ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించింది. అమ్మడి ఖాతాలో సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంది. అయితే మోడలింగ్ రంగంలో మ్యాగజైన్స్ కోసం ఎన్ని అందాలు ఆరబోసిందో సినిమాల్లోకి వచ్చాక అమ్మడు అంతకుమించి అందాల ప్రదర్శన చేసేసింది. ఇంకా చేస్తూనే ఉందని తాజా మ్యాగజైన్ ఫోటోలు చూస్తే తెలుస్తుంది. అమ్మడు ధరించని ఫ్యాషన్ దుస్తులు లేవంటే నమ్మాలి. చీరకట్టు నుండి టూ పీస్ బికినీ వరకు అన్నీ అనుష్కకి కామన్. అయితే ‘బ్యూటీ విత్‌ బ్రెయిన్‌’ అనుష్క కూడా నిరూపిస్తునే ఉంది. తెర పై అందంతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. తెలివితేటలతో వ్యాపార రంగంలోనూ రాణిస్తుంది. సినిమాలు చేస్తూనే.. కొన్ని బ్యూటీ యాడ్స్ ప్రకటనలతో బిజీగా ఉంటుంది ఈ భామ.

బ్యూటీ విత్ బ్రెయిన్ అని అనుష్కను పిలవడానికి మెయిన్ కారణం ఆమె నిర్మాణ సంస్థ. ‘క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌’ నిర్మాణ సంస్థను స్థాపించి కొత్త సినిమాలు నిర్మిస్తుంది. ఆమె సొంత సంస్థలో కేవలం సినిమాలనే కాకుండా తాజాగా వెబ్‌ సిరీస్‌లను కూడా నిర్మిస్తుంది. కథాబలం ఉంటే సినిమాలు తీసి.. సినీ అభిమానులను మెప్పించాలని అనుష్క 2014లో ‘క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌’ పేరుతో ప్రొడక్షన్‌ కంపెనీని ప్రారంభించింది. తన సంస్థ ద్వారా అనుష్క కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం విరాట్ అనుష్కలు లాక్ డౌన్ కారణంగా గృహ నిర్బంధంలో ఉన్నారు. అయితే అమ్మడు కొత్త సినిమాల ఆఫర్స్ అన్నీ రిజెక్ట్ చేస్తుందట. అలాగని యాడ్స్ కూడా రిజెక్ట్ చేస్తుందట. ఎందుకంటే ఆమె ఇప్పుడు కేవలం తన ప్రొడక్షన్ హౌస్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ప్రధానంగా డార్క్ అండ్ హారర్ ఫిలిమ్స్ పై దృష్టి పెడుతుందట అనుష్క. మరి ప్రొడ్యూసర్ గానే ఉండిపోతుందా.. తెరపై మళ్లీ కనిపిస్తుందా.. అంటే సమాధానం ఆమెనే చెప్పాలి!