కొహ్లీ ఛాలెంజ్ కు స్పందించిన అనుష్క

Thu May 24 2018 15:30:47 GMT+0530 (IST)

Anushka Sharma Accepts Virat Kohli Fitness Challenge

ఒలింపిక్ పతక విజేత.. సెంట్రల్ మినిస్టర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మొదలెట్టిన ఫిట్ నెట్ ఛాలెంజ్ సెలబ్రిటీలను బాగానే ఆకట్టుకుంటోంది. ఐస్ బకెట్ ఛాలెంజ్ లాగనే హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ హ్యాష్ ట్యాగ్ తో ఈ ఛాలెంజ్ స్టార్ చేసిన ఆయన తొలుతగా క్రికెటర్ విరాట్ కోహ్లీ.. హృతిక్ రోషన్ కు ఈ ఛాలెంజ్ ఇచ్చాడు.ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన విరాట్ జిమ్ లో తాను చేస్తున్న వర్కవుట్లతో వీడియో షేర్ చేశాడు. ఆ తరవాత ఈ ఛాలెంజ్ తన భార్య - బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు ఇచ్చాడు. ఆమెతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ - క్రికెటర్ ఎం.ఎస్.ధోనీలకు కూడా ఇదే ఛాలెంజ్ ఫార్వర్డ్ చేశాడు. విరాట్ ఛాలెంజ్ కు ప్రధాని మోడీ రెస్పాండయ్యారు. తాను ఈ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేస్తున్నానని.. త్వరలోనే తన ఫిట్ నెస్ వీడియో షేర్ చేస్తానని ట్వీట్ చేశారు.  మరోవైపు తన భర్త ఛాలెంజ్ ను అనుష్క కూడా వెంటనే యాక్సెప్ట్ చేసింది. జిమ్ లో తన ఫేవరెట్ వర్కవుట్ చూడమంటూ వీడీయో షేర్ చేసింది. జిమ్ లో నుంచి వెయిట్ ఎత్తి దింపుతూ తన వర్కవుట్ కంప్లీట్ చేసింది.

అనుష్క శర్మ చేసిన ఈ వర్కవుట్లు చూస్తే ఆమె చేసిన సుల్తాన్ సినిమా గుర్తుకు రాక మానదు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీలో ఆమె రెజ్లర్ పాత్ర చేసింది. తనవంతు పూర్తయ్యాక ఇప్పుడు అనుష్క ఈ ఛాలెంజ్ కు స్వ్కాష్ ప్లేయర్ దీపిక పల్లికల్... తనతోపాటు సూయీ ధాగాలో హీరోగా నటించిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ల పేర్లు నామినేట్ చేసింది.