అనుష్క..రష్మిక ఒకే అపార్ట్ మెంట్ లో? అదెక్కడో తెలుసా?

Sat Dec 03 2022 19:00:01 GMT+0530 (India Standard Time)

Anushka Rashmika in the same Appartment

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన అనుష్క కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడైతే ఖాళీగా ఉంటుంది గానీ..ఉన్నంత కాలం పరిశ్రమలో ఓ వెలుగు వెలిగింది. అలాగని అవకాశాలు రాలేదని కాదు..ఎందుకనో సినిమాల విషయంలో గ్యాప్ అనివార్యమై తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ అనుష్క హైదరాబాద్ని వదల్లేదు. ఇప్పటికీ భాగ్యనగరంలోనే ఉంటుంది.అవసరమైన సందర్భాల్లో సొంతూరు బెంగుళూరుకి వెళ్లి వస్తోంది తప్ప! హైదరాబాద్ ని ఇంకాపూర్తిగా విడిచిపెట్టలేదని తెలుస్తోంది. అనుష్క సినిమాలకు దూరంగా ఉండటంతో  రష్మిక మందన్న లాంటి వారు  స్వీటీ స్థానాన్ని ఆక్రమించాలని  ప్రణాళికలు వేస్తున్నారు.

ఓ వైపు బాలీవుడ్ లో  స్థిరపడాలి అన్నా ఆలోచన ఉన్నా?  టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ స్థానం ఖాళీగానే ఉందిగా..అక్కడో కర్చీప్ వేసేస్తే పోలే అన్న ఆలోచన అమ్మడిలో కనిపిస్తుంది.

మరి అక్కడ కర్చీప్ వేస్తుందా? ఆ స్థానానికి చేరుకుంటుందా?  లేదా అన్నది పక్కనబెడితే లగ్జరీయస్ జీవితాన్ని మాత్రం అనుష్క ధీటుగానే ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది.  తాజాగా ఈ అందమైన భామలిద్దరు ఒకే అపార్ట్ మెంట్ లో ఉంటున్నట్లు తెలిసింది. ఇద్దరు పోష్ సోసైటీ కల్చర్ లో ఖరీదైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. సిటీలోనే ఖరీదైన  జయభేరి ది పీక్ లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది.

ఇద్దరు ఒకే  బ్లాక్ లో డిఫరెంట్ ప్లోర్స్ లో ఉంటున్నారు.  వీళ్లతో పాటు చాలా మంది సెలబ్రిటీలు అదే అపార్ట్ మెంట్ లో  నివాసముంటున్నారు. కోట్ల రూపాయాలు  వెచ్చించి  ప్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరికొంత మంది లక్షల్లో అద్దెచెల్లించి ఉంటున్నారు. జయభేరి ది పీక్ అపార్ట్ మెంట్ కల్చర్ లో చాలా అడ్వాన్స్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

సిటీలో అత్యంత విలాసవంతమైన  అపార్ట్ మెంట్ ఇది.  ఆ ప్రాంతమంతా పోష్ కల్చర్. సెలబ్రిటీలు...రాజకీయ నాయకులు..బిజినెస్ మెన్ లు..ఐటీ సంస్థలు  కొలవుదీరిన ప్రాంతం.జూబ్లీహిల్స్..బంజారాహిల్స్ ..లాంకో హిల్స్ లాంటి వాటిని తలదన్నే నిర్మాణాలు  శర వేగంగా జరుగుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.