పోస్టర్ టాక్: చేయి పలికే నిశబ్దం

Tue Sep 10 2019 15:56:50 GMT+0530 (IST)

Anushka Nisabdham movie New Poster

భాగమతి తర్వాత ఏడాది గ్యాప్ తో వస్తున్న అనుష్క కొత్త సినిమా నిశబ్దం ఫస్ట్ లుక్ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ఒక పెయింటింగ్ వేస్తున్న చేతిని చూపిస్తూ ఆ బొమ్మని రివీల్ చేయకుండా ఇదేదో మిస్టరీ థ్రిల్లర్ అనే ఫీలింగ్ వచ్చేలా దీన్ని డిజైన్ చేశారు. ఒక కోణంలో చూస్తే అనుష్కనో లేదా మాధవనో పెయింటర్ ఉండే ఛాన్స్ ఉంది. మరి నిశబ్దం అనే టైటిల్ కి ఈ అందమైన పెయింటింగ్స్ కి కనెక్షన్ ఏముందో టీజర్ వచ్చాక కొంత క్లారిటీ రావొచ్చు.హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న నిశబ్దంకు గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇటీవలి కాలంలో ఈ ప్రీ లుక్స్ ట్రెండ్ ఎక్కువయ్యింది. పబ్లిక్ తో మీడియా వీటిని పెద్దగా పట్టించుకోకపోయినా సదరు సినిమా యూనిట్స్ మాత్రం ఒకటి రెండు రోజులు ముందు వీటిని వదులుతూ హైప్ ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

చేతులో లేక బ్యాక్ షాట్ నుంచి కనిపించకుండా హీరో హీరొయినో ఇలా ఏదో ఒకటి సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగూ ఒకే రోజు గ్యాప్ ఉన్నప్పుడు నేరుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే సరిపోతుంది కాని ఇలా ప్రతి చిన్నా పెద్ద సినిమాకు చేతులు కాళ్ళు రిలీజ్ చేసే పబ్లిసిటీ మర్మమేమిటో మరి