'సైరా' పాటలో తమన్నాతో పాటు స్వీటీ కూడా..?

Fri May 24 2019 16:45:06 GMT+0530 (IST)

Anushka In Sye Raa Movie Song Along With Tamanna

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. స్వాతంత్య్ర ఉద్యమం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం పెద్ద ఎత్తున చిత్రీకరణ చేశారు. దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మిగిలి ఉన్న ఒక్క పాట చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్టింగ్ లో పాట చిత్రీకరణకు అంతా సిద్దం చేశారు.చిరంజీవితో పాటు ఈ పాటలో తమన్నా ఆడి పాడబోతున్నట్లుగా మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాటలో తమన్నాతో పాటు అనుష్క కూడా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పాట వరకే అనుష్క ఉంటుందని ఆమెకు సీన్స్ ఏమీ ఉండవని అంటున్నారు. సినిమా క్రేజ్ పెంచేందుకు అనుష్కను ఇలా పాటలో నటింపజేయాలనే ప్రయత్నం చేసినట్లుగా సమాచారం అందుతోంది.

ఈ చిత్రంలో చిరంజీవి మాత్రమే కాకుండా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్... నయనతార.. తమన్నా.. జగపతిబాబు.. సుదీప్.. విజయ్ సేతుపతి.. నిహారిక ఇంకా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రంను గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.