అందానికే అసూయ పుట్టే అందం.. ఈ భామ సొంతం!

Sat Jul 11 2020 23:59:10 GMT+0530 (IST)

Anushka Goes Beautiful For Vogue And Stuns Everyone

కొందరు హీరోయిన్లను చూస్తే అసూయ పుడుతుంది. ఎందుకంటే వారు అందంతో పాటు తెలివితో వాళ్ల కెరీర్ విజయవంతంగా మలుచుకుంటారు. అలాంటి టాలెంట్.. అసూయపడే అందం ఉన్న హీరోయిన్ అనుష్క శర్మ. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్. మరోవైపు ఇండియన్ స్టార్ క్రికెటర్.. ప్రెసెంట్ ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి. ఆ హోదా కాపాడుకుంటూ తన సినీ ప్రయాణం కొనసాగిస్తుంది అనుష్క. విరాట్ తో పెళ్లి తర్వాత ఆమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే తనకంటూ ఓ మనిషి.. తన కోసం ఎదురుచూసే మనిషి ఉన్నాడనే ధైర్యం ఆమెలో నింపుకుంది.ఆ ధైర్యాన్ని విరాట్ కూడా ఇస్తాడట. అలాగే విరాట్ జీవితంలో కూడా అనుష్క ముఖ్య పాత్ర పోషిస్తుంది. కేవలం అర్ధాంగిగా మాత్రమే కాదు.. ఓ సపోర్ట్.. ఓ ఫ్రెండ్.. అన్నింట్లో తోడుగా ఉంటోంది. అలాగని ఎప్పుడు కూడా భర్త విషయాలలో తలదూర్చను అంటోంది ఈ ముద్దుగుమ్మ. కథానాయికగా కెరీర్ ప్రారంభించిన అనుష్క.. దాదాపు బాలీవుడ్ లోని స్టార్ హీరోల అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. షారుఖ్ ఖాన్ మొదలుకొని నేటితరం వరుణ్ ధావన్ వరకు. తనకంటూ ఓ నిర్మాణ సంస్థ కూడా ఏర్పాటు చేసుకొని సినిమాలు నిర్మిస్తుంది. ఇటీవలే రెండు వెబ్ సిరీస్లు కూడా నిర్మించి హిట్స్ అందుకుంది.

ఇక సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ అభిమానులకు అందుబాటులో ఉండే అనుష్క ఈ మధ్య ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది. తాజాగా వోగ్ మ్యాగజైన్ కోసం షూట్ చేసిన ఫోటోను షేర్ చేసింది అమ్మడు. ఆ ఫోటోలో అనుష్క సాగర తీరంలో మోకాళ్ళ పై కూర్చొని నవ్వుతూ ఉంది. అలా నవ్వుతూ ఉన్న అనుష్కను ఆరాధించే అభిమానులు లక్షల్లో ఉన్నారు. కానీ ఈ ఫోటోలో కాస్త గ్లామర్ షో ఎక్కువగానే చేసింది. తన మేని సోయగాలన్ని కెమెరా ముందుంచింది. అంతే అభిమానులు.. నెటిజన్లు తమకు కన్నుల పండుగలా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా అనుష్క నవ్వుతోనే మాయ చేయగలదని మళ్లీ నిరూపించింది!