Begin typing your search above and press return to search.

ప్రభాస్ కు అనుష్క స్పెషల్ బర్త్ డే విషెస్..!

By:  Tupaki Desk   |   23 Oct 2021 8:30 AM GMT
ప్రభాస్ కు అనుష్క స్పెషల్ బర్త్ డే విషెస్..!
X
'బాహుబలి' సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాస్తా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దేశ విదేశాల్లో అభిమానులని సంపాదించుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. నేడు శనివారం డార్లింగ్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా అంతా సినీ ప్రముఖులు అభిమానుల శుభాకాంక్షలతో నిండిపోయింది. ప్రభాస్ కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాయి.

ప్రభాస్ కు అత్యంత సన్నిహితురాలైన హీరోయిన్ అనుష్క శెట్టి కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రభాస్ ఉన్న ఓ అద్భుతమైన ఫోటోను షేర్ చేస్తూ అనుష్క పెట్టిన నోట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ''హ్యాపీ బర్త్ డే ప్రభాస్. జీవితంలో మీకు అంతా మంచి మాత్రమే జరగాలని కోరుకుంటున్నాను. మీరు నటించే సినిమాలు అందరి హృదయాలకు చేరాలని కోరుకుంటున్నాను. సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అని అనుష్క పేర్కొన్నారు.

'బిల్లా' సినిమాలో ప్రభాస్ - అనుష్క తొలిసారిగా కలిసి నటించారు. తర్వాత 'మిర్చి' 'బాహుబలి' 1 & 2 సినిమాలలో సూపర్ హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి జంటకు ప్రత్యేకంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వీళ్లిద్దరూ కలసి స్క్రీన్ మీద కనిపిస్తే కనులపండుగలా ఉంటుందని వారు భావిస్తుంటారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య రిలేషన్ గురించి ఎన్నో గాసిప్స్ కూడా వచ్చాయి. అయితే తాము మంచి స్నేహితులమని ప్రభాస్ - అనుష్క చెబుతూ వచ్చారు. అప్పటి నుంచి ఇద్దరూ నిజమైన స్నేహితుల్లాగే మెలుగుతున్నారు. ఈ క్రమంలో నేడు 'బాహుబలి'కి దేవసేన స్పెషల్ బర్త్ డే విషెస్ అందించింది.

కాగా, పాన్ ఇండియా స్టార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఇన్‌స్టాగ్రామ్‌ ప్రభాస్ కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. 'గ్లోబ‌ల్ ప్ర‌భాస్ డే' అంటూ న్యూ ఫిల్ట‌ర్ ను జత చేసింది. 'రాధే శ్యామ్' టీజ‌ర్‌ లోని మ్యూజిక్‌ ను ప్లే చేస్తూ రూపొందించిన ఫిల్ట‌ర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ ఫిల్టర్ తో రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.