Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : అందమైన కళాఖండంలా విరుష్క

By:  Tupaki Desk   |   19 Oct 2020 4:45 AM GMT
ఫొటోటాక్‌ : అందమైన కళాఖండంలా విరుష్క
X
ఫొటోల కంటే పెయింటింగ్స్‌ చాలా కలర్‌ ఫుల్‌ గా అద్బుతంగా అనిపిస్తూ ఉంటాయి. ఎంత క్రియేటివిటీతో తీసినా కూడా పెయింటింగ్స్‌ స్థాయిలో ఫొటోలు మనసును దోచుకోలేవు. కాని లక్షల్లో ఒక్క ఫొటో మాత్రం ఇలా అద్బుతమైన కళాఖండం మాదిరిగా ఉండి హృదయాలను తాకుతుంది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది అనుష్క మరియు విరాట్‌ కోహ్లీ. వీరిద్దరు నీటిలో మెడ వరకు మునిగి సాయంకాలం సమయంలో ఒక పురాతన కట్టడం ముందు ఇలా ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ వావ్‌ అనిపించేలా ఉన్నారు.

నెటిజన్స్‌ కళ్లు తిప్పుకోకుండా చూస్తున్న ఈ అద్బుతమైన కళాఖండంను ప్రముఖ క్రికెటర్‌ ఎబి డెవిలియర్స్‌ తీశాడట. ఈ ఫొటోకు ప్రముఖులు సైతం చాలా అద్బుతంగా ఉందని. అందమైన బ్యాక్‌ గ్రౌండ్‌ లో అందమైన జంట అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అనుష్క.. విరాట్‌ ల మద్య ఉన్న ప్రేమతో ఈ ఫొటో అద్బుతంగా వచ్చిందని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దుబాయిలో ఐపీఎల్‌ ఆడుతున్న కోహ్లీ.. అనుష్క కూడా అక్కడే ఉంది. ప్రస్తుతం అనుష్క ప్రెగ్నెంట్‌ అనే విషయం తెల్సిందే.