Begin typing your search above and press return to search.

దిగ్గజ దర్శకుడు తాగి అరెస్ట్‌ అయ్యాడట!

By:  Tupaki Desk   |   6 Feb 2023 1:26 PM GMT
దిగ్గజ దర్శకుడు తాగి అరెస్ట్‌ అయ్యాడట!
X
బాలీవుడ్ లో విభిన్న చిత్రాల దర్శకుడిగా మంచి పేరు దక్కించుకుని.. ఒకప్పుడు దిగ్గజ దర్శకుడిగా బాలీవుడ్ లోనే ప్రముఖ దర్శకుడిగా పేరు దక్కించుకున్న అనురాగ్‌ కశ్యప్‌ ఈ మధ్య కెరీర్‌ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ అవ్వలేక పోతున్నాడు. కమర్షియల్‌ గా ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు నిరాశ పర్చుతూ ఉన్నాయి.

గత ఏడాది విడుదల అయిన సినిమా తో పాటు ఈ ఏడాదిలో వచ్చిన సినిమా కూడా నిరాశ మిగల్చడంతో అనురాగ్‌ కశ్యప్‌ నుండి కమర్షియల్‌ మూవీని అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన మేకింగ్‌ స్టైల్‌ మారలేదు.. కానీ ప్రేక్షకుల అభిరుచి మారింది. అందుకే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఆయన సినిమాలు తీయాలని చాలా మంది కోరుకుంటున్నారు.

అనురాగ్‌ కశ్యప్‌ తాజాగా అన్ ఫిల్టర్డ్‌ విత్ సమ్దీష్ టాక్ షో లో పాల్గొన్నాడు. ఆ టాక్‌ షో లో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఎదుర్కొన్న చేదు అనుభవంతో పాటు డెన్మార్క్‌ లో జరిగిన చీకటి సంఘటనల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపర్చాడు.

సౌదీ అరేబియాలో మద్యం తాగి పంది మాంసం బ్యాగ్ ను తీసుకు వెళ్తున్న సమయంలో అరెస్ట్‌ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. డెన్మార్క్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం ఎక్కలేక పోయాను. అప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నాడు.

సౌదీ లో అరెస్ట్‌ అయిన సమయంలో మూడు గంటల పాటు అక్కడి అధికారులతో గొడవ పడ్డాను. తాగిన మైకంలో ఇష్టానుసారంగా వారితో మాట్లాడాను. చివరకు మూడు గంటల తర్వాత జెట్ ఎయిర్ వేస్ ద్వారా ప్రయాణం చేశాను.

అంతే కాకుండా ఖాళీ సమయంలో తాను డేటింగ్ యాప్స్ ను వాడుతాను అన్నాడు.. అయితే నా పేరు వాడకుండా నా మేనేజర్‌ లేదా స్నేహితుల పేర్లను వాడుతాను అన్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.