Begin typing your search above and press return to search.

సాధికారిత పురుషుల‌కే రాలేద‌నిపిస్తుంది! అనుప‌మ‌

By:  Tupaki Desk   |   16 Aug 2022 2:30 AM GMT
సాధికారిత పురుషుల‌కే రాలేద‌నిపిస్తుంది! అనుప‌మ‌
X
మ‌హిళా సాధికారిత కోసం ప్ర‌భుత్వాలు చేప‌డుతోన్న? కార్య‌క్ర‌మాలు ఎంత పెద్ద స‌క్సెస్ అవుతున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌ల్లె నుంచి ప‌ట్ట‌ణం వ‌ర‌కూ సాధిక‌ర‌త దిశ‌గా ప‌డుతోన్న అడుగుల‌తో దేశం మును ముందుకు పోతుంది. మ‌హిళ‌లు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురుషుల‌తో పోటీ ప‌డుతున్నారు. వెనుక బ‌డిన వ‌ర్గం సైతం ఇప్పుడెంతో ముంద‌కు సాగుతుంది.

విద్య‌..వైద్య‌..సాంకేతిక స‌హా అన్ని రంగాల్లోనూ పురుషుల్ని మించిపోతున్నారు? అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. 75 ఏళ్ల‌ స్వాతంత్ర్యంలో మ‌హిళలు ఎంతో ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ని తీర్చుదిద్దుకున్నారు. తాజాగా స్వాతంత్ర్య దినో త్స‌వం సంద‌ర్భంగా న‌టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ పురుషుల్ని ఉద్దేశించి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేసింది.

"మ‌హిళా సాధికార‌త విష‌యంలో మీ ఆలోచ‌న‌లు ఎలా ఉన్నాయంటే? " మ‌హిళ‌లు అన్ని ర‌కాలుగా సాధికార‌త సాధించారు. ప్ర‌త్యేకంగా మ‌ళ్లీ దాని గురించి మాట్లాడాల్సిన ప‌నిలేదు. ప‌దే ప‌దే మ‌హిళ‌లు వెనుక‌బ‌డి ఉన్నార‌ని చెప్ప‌డం వ‌ల్లే ఇంకా వెనుక‌బ‌డిపోతున్నారు అన్న భావ‌న క‌ల్గుతుంది. ఇప్పుడున్న మ‌హిళ‌లు మ‌గ‌వారితో స‌మానంగా కొన‌సాగుతున్నారు.

వారు ఓవైపు వృత్తిలో కొన‌సాగుతూనే ఇంటి బాధ్య‌త‌లు తీసుకుంటున్నారు. కానీ మ‌గ‌వాళ్లు అలా కాదు. ప‌ని చేసి ఇంటికొచ్చిన వెంట‌నే వాళ్ల‌కి అన్ని ఏర్పాటు చేయాలి. టీ తెమ్మంటే మ‌హిళ‌లు ఎలాంటి ప‌రిస్థుతుల్లో ఉన్నా ఆ ప‌ని చేయాలి. బాగా అలిసి పోయాం? అనేస‌రికి ఆ ప‌ని చేయ‌క త‌ప్ప‌దు. నాకు తెలిసి సాధికార‌త మ‌హిళ‌ల‌కు వ‌చ్చింది. మ‌గ‌వాళ్ల‌కే రాలేద‌నిపిస్తుంద‌ని'' వ్యాఖ్యానించింది.

ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. పురుషుల మ‌నోభావాలు దెబ్బ తీనేలా? ఉన్నాయంటూ కొంత మంది అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అనుప‌మ ఈ వ్యాఖ్య‌లు న‌వ్వుతూ అనేసినా మ‌రింత వివాదానికి దారి తీసే అవ‌కాశం క‌నిపిస్తుంది.

పురుషాధిక్యంపై ఇప్ప‌టికే ప‌లువురు బాలీవుడ్ న‌టీమ‌ణులు మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. కంగ‌నా ర‌నౌత్ మ‌హిళా సాధికార‌త గురించి ఇప్ప‌టికే ప‌లుమార్లు స్పందించిన సంగ‌తి తెలిసిందే.