అనుపమ రింగుల జుట్టుకి పడిపోయిన బాలీవుడ్

Wed Aug 17 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

Anupama Parameswaran is attracting Bollywood Audience

సౌత్ సినిమాల జోరు బాలీవుడ్ లో కంటిన్యూ అవుతోంది. తాజాగా నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొంది విడుదల అయిన కార్తికేయ 2 సినిమా విడుదల అయ్యింది. హిందీ లో ఈ సినిమా అతి తక్కువ స్క్రీన్స్ ల్లో విడుదల అయ్యింది. రోజు రోజుకు స్క్రీన్స్ పెరుగుతూ వచ్చాయి. అక్కడ కార్తికేయ 2 సినిమా భారీ ఎత్తున వసూళ్ల ను నమోదు చేయబోతున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో కార్తికేయ 2 సినిమా లో నటించిన అనుపమ పరమేశ్వరన్ బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ తన రింగుల జుట్టు తో ఫిల్మ్ మేకర్స్ ను ఆకర్షించిన అనుపమ పరమేశ్వరన్ ఒకటి రెండు ఆఫర్లను కూడా అప్పుడే దక్కించుకుందని అంటున్నారు.

సౌత్ హీరోలు.. హీరోయిన్స్ ల్లో ఏ ఒక్కరిని కూడా వదలని బాలీవుడ్ ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ ను హిందీలో నటింపజేసే ప్రయత్నాలు చేస్తోంది.

టాలీవుడ్ కి చెందిన పలువురు స్టార్ హీరోయిన్స్ ఇప్పటికే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కి వరుసగా హిందీ సినిమాల్లో ఆఫర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హీరోయిన్ గా టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు కార్తికేయ 2 వల్ల బాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ ప్రేమమ్ బ్యూటీ తెలుగు లో ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నటిగా మంచి ప్రతిభ కలిగిన అనుపమ పరమేశ్వరన్ కార్తికేయ 2 లో తన పాత్ర పరిధి లో నటించి మెప్పించింది. నటిగా కార్తికేయ 2 తో తనను తాను నిరూపించుకున్న అనుపమ పరమేశ్వరన్ ముందు ముందు బాలీవుడ్ లో బిజీ అయ్యేనో చూడాలి.