వీడియో: సాయం సంధ్య మయూరం

Fri Feb 21 2020 10:30:21 GMT+0530 (IST)

Anupama Parameswaran dance in beach

నాట్యం .. క్లాసికల్ డ్యాన్స్ అనగానే సాగర సంగమం.. స్వర్ణ కమలం.. శంకరాభరణం లాంటి క్లాసిక్స్ గుర్తుకు వస్తాయి. జయప్రద- భానుప్రియ- మంజు భార్గవి వంటి గొప్ప నాట్యకళాకారిణుల్ని అభిమానులు స్మరించుకుంటారు. అభినయనేత్రిలుగా .. నాట్య మయూరాలుగా అభిమానుల గుండెల్లో నిలిచిన మేటి కథానాయికలు వీరంతా. క్లాసిక్ డ్యాన్స్ పెర్ఫామర్స్ గా ఓ వెలుగు వెలిగారు.అయితే ఇటీవలి కాలంలో నవతరంలో ఈ తరహా క్లాసిక్ డ్యాన్స్ ట్యాలెంట్ ఉన్నా కళాతపస్వి కె.విశ్వనాథ్ కి వారస దర్శకులెవరూ లేకపోవడం వల్ల ఆ తరహా అవకాశాలు రావడం లేదు. సాయి పల్లవి- అనుపమ- నివేద థామస్ లాంటి మలయాళీ నాయికలు క్లాసిక్ డ్యాన్స్ టచ్ తోనే పాపులరయ్యారు. నాయికలు అయ్యాక ఆ స్కిల్ ని ప్రయోగించే అవకాశం రానందుకు కలత చెందిన సందర్భాలున్నాయి.

అయితే సినిమా పరంగా ప్రూవ్ చేసుకునేందుకు అవకాశం దక్కలేదన్న నిరాశతోనేనేమో.. ఇదిగో క్యూట్ అనుపమ సాగర తీరానికి వెళ్లిపోయి ఇలా భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తోంది. కూచిపూడి.. కథక్ వంటి విద్యల్లోనూ అనుపమ ఇదివరకూ శిక్షణ తీసుకుంది. మొత్తానికి తనలోని మయూరిని బయటకు తీసిందిలా. సాగర తీరంలో నవ నాయిక నాట్యం ఎంతో అద్భుతంగా ఉంది కదూ? చీరకట్టులో అనుపమ ఇలా నాట్యమాడుతుంటే నెమలిని తలపిస్తోంది. ఆ రింగుల కురులు గాల్లో ఎగురుతూ ప్రత్యేక శోభను తెచ్చాయి. సాయం సంధ్యలో మయూర నాట్యం వీక్షించే భాగ్యం కల్పించిన అనుపమకు థాంక్స్ అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అన్నట్టు అనుపమ వరుస ఫ్లాపులతో రేసులో వెనకబడింది. రాక్షసుడు తర్వాత సినిమాల్లేవ్. మరి ఈ డైలమా నుంచి భయట పడేదెలా? ఇటీవలే ఈ క్యూటీకి ఓ యంగ్ హీరో ఆఫర్ ఇచ్చాడు. గ్యాప్ తర్వాత మళ్లీ అనుపమ ట్రీట్ కి బోయ్స్ రెడీ కావాల్సిందే.