ఊళ్లో కుర్రాళ్లంతా షాకయ్యేలా క్యూటీ చేసిన పని!

Sat Jan 15 2022 15:00:01 GMT+0530 (IST)

Anupama Lip Lock Goes Viral

దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కాలేజ్ యాక్షన్ లవ్ డ్రామా నేపథ్యంలో రౌడీ బోయ్స్ పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. యథావిధిగా ఆశిష్ డ్యాన్స్ లు ప్రేక్షకులకు నచ్చగా.. సినిమా రొటీన్ గా సాగిందని టాక్ వినిపించింది.అయితే ఆశిష్-అనుపమ పరమేశ్వరన్ మధ్య హాట్ లిప్ లాక్ సీన్ సినిమాని టాక్ పాయింట్ గా మార్చింది. చిన్నపాటి ప్రేమాయణ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ షాక్ కి గురి చేసింది. అనుపమ మునుపెన్నడూ లేనంత బోల్డ్ గా కనిపించడంతో అంతా షాక్ కి గురవుతున్నారు.

ఆరేళ్ల కెరీర్ లో అనుపమ ఎప్పుడూ ఇంత బోల్డ్ యాక్ట్ చేయలేదు. ఆమె ఎప్పుడూ స్క్రీన్ పై స్కిన్ షో చేయలేదు. పెదవి పెదవి కలిపి నాలుక నాలుకను తాకేలా ముద్దులు వేయలేదు. కానీ రౌడీ బోయ్ తో సీన్ లో అనుపమ ముద్దుతో అదరగొట్టేయడంతో థియేటర్లలో పొగలు వస్తున్నాయిట.

మొత్తానికి క్యూట్ బ్యూటీ గేమ్ ప్లాన్ మార్చినట్టే కనిపిస్తోంది. బి-సి సెంటర్లలో ఈ సీన్ కోసమే సినిమా చూసేందుకు వెళ్లేవారున్నారు! అంటూ ఒకటే టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఆసక్తికరంగా డెబ్యూ హీరో చెలరేగిపోవడం వెనక దిల్ రాజు లో వస్తున్న మార్పు కూడా కారణం అంటూ గుసగుస వినిపిస్తోంది. తన సినిమాలన్నిటినీ ఫ్యామిలీ ఆడియెన్ ని దృష్టిలో ఉంచుకుని తెరకెక్కించే నిర్మాత దిల్ రాజు. కానీ ఈసారి ఆయన రూల్ ని బ్రేక్ చేశారు. వారసుడిని యూత్ కి ఎక్కించేందుకు అలా టెంప్టింగ్ సీన్లకు ఓకే చెప్పేశారని ఇండస్ట్రీలో గుసగుస సాగుతోంది.

అనుపమ హద్దులు చెరిపేసే గ్లామరస్ పాత్రలు కూడా చేయగలదు అనే పాయింట్ ను నిరూపించుకోవడానికి మాత్రమే బోల్డ్ గా మారిందని విమర్శించే వర్గం కూడా లేకపోలేదు. మరీ ఇంతగా చెలరేగిపోవడం అవసరమా? అయినా సీనియర్ హీరోలతో ఏనాడూ లిప్ లాక్ వేయని బ్యూటీ కుర్ర డెబ్యూ హీరోకి అలా టెంప్ట్ అయిపోయిందేమిటీ? అని ప్రశ్నించేవాళ్లు ఉన్నారు.