Begin typing your search above and press return to search.

వ‌ల‌పుల ఎక్స్ లేట‌ర్ తొక్కార‌మ్మో

By:  Tupaki Desk   |   26 Feb 2020 9:15 AM GMT
వ‌ల‌పుల ఎక్స్ లేట‌ర్ తొక్కార‌మ్మో
X
వలపుల ఎక్స్‌లేటర్ తో భామలు కుర్రాళ్ల‌ హార్ట్‌ బీట్ పెంచేసారులే. చూపుల్లో అయస్కాంతం వ‌ల విసిరి మ‌త్తుగా క‌వ్వించారు. అయితే అనుకున్న‌ది అనుకున్న‌ట్టు అవుతుందా? అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి.. త‌ప్ప‌దు మ‌రి. మన్మథ సామ్రాజ్యపు మందిరంలోకి తొంగి చూస్తే ప‌ర్య‌వ‌సానం ఇలానే ఉంటుంది. `అనుకున్నది ఒక్కటి అయినది` చిత్రంలో నలుగురు భామలు బోల్డ్ పెర్ఫామెన్స్ తో చెల‌రేగార‌నే చెప్పాలి. ఇక పోస్ట‌ర్ల‌లోనూ సెక్సీ భంగిమలతో అదరగొట్టారు. కామేడీ- అడ్వెంచర్ డ్రామాతో రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవ‌లే విడుద‌లై ఆక‌ట్టుకుంది. ఇందులో నటించిన ధన్య బాలకృష్ణ- కోమలీ ప్రసాద్- సిద్ధి ఇదానీ- త్రిధా చౌదరి మ‌త్తు క‌ళ్ల‌తోనే చిత్తు చేశారంతే. వైన్‌ బాటిళ్లతో అమ్మాయిలు చేసిన రచ్చతో కాలేజీ బాబుల గుండెలు కిక్కెక్కిపోతున్నాయి. బెడ్‌ మీద డబుల్‌ మీనింగ్‌ డైలాగులతో త్రిథా చౌదరి జిల్ అనిపించింద‌నే చెప్పాలి.

కొత్త దర్శకుడు బాలు అడుసుమల్లి వెండితెరపై అందాల విందును సిద్ధం చేస్తున్నారనే అర్థ‌మ‌వుతోంది. ఇక‌ ఈ సినిమా ప్రచారాన్ని విశాఖ తీరాన అలా ప‌రుగెత్తించారు. ఇక‌పై ఇదిగో ఈ కార్ లోనే అన్ని న‌గ‌రాల్ని చుట్టేస్తార‌ట‌. సినిమాలో మసాలా కంటెంట్ ఎక్కువగానే ఉంద‌ని ట్రైల‌ర్ చెప్ప‌క‌నే చెప్పింది.

అయితే రిజ‌ల్ట్ విష‌యం లోనూ అనుకున్న‌దొక్క‌టి అయిన‌దొక్క‌టి కాకూడ‌దంటే ప్ర‌చారం లో ఇంకా స్పీడ్ పెంచాల్సి ఉంటుంది. అమ్మాయిలు అందాల ఆరబోతను నమ్ముకుని వచ్చిన లేడీ బ్యాచిలర్స్‌ సరైన కథ లేకుండా థియేటర్లలోకి వచ్చి అమాంతం బోర్లా పడిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో మాదిరిగా ఇందులోనూ నలుగురు వయ్యారి మల్లె తీగలు ఫుల్‌ లెంగ్త్‌ ఎక్స్‌పోజింగ్‌తో కుమ్మేస్తున్నా.. కంటెంట్ ప‌రంగా గ్రిప్ లేక‌పోతే హిట్టెక్క‌డం క‌ష్ట‌మే. అందాల విస్తరిలో వ‌డ్డించేస్తే స‌రిపోతుందా? ప్రేక్షకులు కడుపు నింపుకోవాలంటే కథ కాక‌ర‌కాయ‌ ఉంటేనే ఫుల్‌ మీల్స్‌ అంటారు. సినిమా లో విష‌యం ఎంతో తేలాలంటే మార్చి 6 వరకు వేచి చూడాల్సిందే.