అణువణువు అందం తొణికిసలాడుతోంది

Sun Nov 28 2021 06:00:01 GMT+0530 (IST)

Anu Emmanuel Mesmerizing Looks

ఎన్నారై బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ కెరీర్ టాలీవుడ్ లో ఎలా సాగుతుందో చెప్పాల్సిన పనిలేదు. చికాగో(అమెరికా)ను విడిచి సినీనాయికగా కెరీర్ ప్రారంభించి ఆరేడేళ్లు అవుతున్నా సరైన సక్సెస్ ఒక్కటీ లేదు. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్సులు వచ్చినా ఫలితాలు తారుమారవ్వడంతో అను కెరీర్ కూడా ట్రాక్ తప్పింది. తొలి నుంచి దురదృష్టం తనని వెంటాడింది. ఈ ఏడాది `మహా సముద్రం` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. కానీ నమ్మకం నిలబడలేదు. దీంతో అమ్మడు ఇంకా బ్యాడ్ ఫేజ్ నుంచి బయటపడలేదని తేలిపోయింది. ప్రతిభ గల నటి అయినా టైం కలిసి రాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది. ఇంకా వెబ్ సిరీస్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వలేదు. అమ్మడిలో బోల్డ్ యాంగిల్ ఇప్పటికే బహిర్గతం కాబట్టి ఓటీటీ వరల్డ్ లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది కొంత మంది నమ్మకం. ఆ రకంగా దృష్టి సారిస్తే సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ఓటీటీ కంటెంట్ కి కావాల్సిన లక్షణాలన్ని అను ఇమ్మాన్యుయేల్ లో పుష్కలంగా ఉన్నాయన్నది తెలిసిందే. ఇక ఫోటో సెషన్స్ లో ఈ బ్యూటీ అందాల ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. క్రియేటివ్ మేకర్స్ కి సౌకర్యమైన కోణంలో దిట్ట. ఆ రకంగా ఇప్పటికే చాలా పోటో షూట్లతో నిరూపించుకుంది.

తాజాగా అను ఇమ్మాన్యుయేల్ కొత్త ఫోటోలు కొన్ని ఇన్ స్టాని షేక్ చేస్తున్నాయి. రకరకాల డిజైనర్ దుస్తుల్లో అనూ ఫోటోషూట్ మైండ్ బ్లాక్ చేసింది. నుదిటిన రూపాయి బిళ్లంత పాపిడి బొట్టుతో ఒక భంగిమ హైలైట్. ప్లెజెంట్ గా కనిపిస్తూ ప్రతి కోణంలోనూ అనూ అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరికొన్ని ఫోటోల్లో కిల్లర్ లుక్స్ తో చూపరులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. వీటిపై నెటిజనుల కామెంట్లు.. ఎమోజీలు అంతే ఆసక్తిని రేకెత్తించాయి.