Begin typing your search above and press return to search.

సొగసుల ఖిల్లా .. ఈ పిల్ల

By:  Tupaki Desk   |   21 Feb 2021 4:00 AM GMT
సొగసుల ఖిల్లా .. ఈ పిల్ల
X
ముట్టుకుంటే మాసిపోయేది అందం .. పట్టుకుంటే జారిపోయేది అందం. కళ్లెత్తి చూస్తే కమిలిపోయేది అందం .. కళ్లు మూసుకున్నా రెప్పల తలుపుల వెనక రెక్కలు విప్పుకునేది అందం. అంతటి అందగత్తెలు పూర్వం రోజుల్లో ఉండేవారేమో .. ఇప్పుడు లేరనే వారికి ఒకసారి అనూ ఇమ్మాన్యుయేల్ ను చూపిస్తే, వాళ్లు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు .. ఆమె అభిమానులుగా మారిపోతారు .. ఆరాధకులుగా మిగిలిపోతారు.

అందాన్ని తూచలేం .. కొలవలేం .. కానీ అనూ ఇమ్మాన్యుయేల్ ను ఒక నిదర్శనంగా మాత్రం చూపించవచ్చు. ఆమె కళ్లు కలువ సరస్సులనీ .. ఆమె చూపులు మన్మథ బాణాలని నిర్వచించుకోవచ్చు. ఈ మధ్య అనూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. వస్త్రాలను పొదుపుచేస్తూ .. సొగసుల కళ్లాలను వదిలేస్తోంది. అనూని చూసిన వాళ్లు అందాలా బృందావనానికి ఆకారం వచ్చిందా? అని అనుమాన పడుతున్నారు. పాలపై మీగడతరకలాంటి ఈ అమ్మాయిని చూడగానే పంచదార కోసం పరిగెడుతున్నారు.

పాలకోవాలాంటి ఈ అమ్మాయిని ఇలా చూసినవారెవరికైనా, "ఆ బ్రహ్మ నిన్ను మళ్లీ మళ్లీ చూసి .. తనని తానే మెచ్చుకోడా ముచ్చటేసి" అంటూ అదేదో సినిమాలో సీతారామశాస్త్రిగారు రాసిన పాట గుర్తుకు రావడం ఖాయం. అలాంటి అనూ తన అందానికి అదృష్టం కూడా తోడయ్యే సమయం కోసం ఎదురుచూస్తూ, అందులో భాగంగానే 'మహాసముద్రం' సినిమాను ఒప్పుకుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, అనూకి అదృష్టాన్ని పరిచయం చేయాలనే కోరుకుందాం.