అవకాశాల కోసం 'అనూ బేబీ' అందాల ఆరబోత

Sat Mar 28 2020 23:00:01 GMT+0530 (IST)

Anu Emmanuel Glamourous Photo Shoot For Movie Offers

అను ఇమ్మాన్యుయేల్...తెలుగులో నాని హీరోగా వచ్చిన 'మజ్ను' సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘అజ్ఞాతవాసి’ సినిమా చేసింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రావాల్సినంత గుర్తింపు రాలేదు ఈ భామకు. ఆ తర్వాత అల్లు అర్జున్ “నా పేరు సూర్య” సినిమాతో మరో డిజాస్టర్ ను అందుకుంది. తెలుగులో మరో ప్రయత్నంగా 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం ద్వారా ముందుకొచ్చింది. కానీ ఈసారి కూడా పరాజయమే వెక్కిరించింది ఈ బేబీకి. ఇక తమిళంలో ఆమె నటించిన “తుప్పారివాలన్” తెలుగులో 'డిటెక్టివ్'గా వచ్చింది. ఆ సినిమా తెలుగులో మంచి టాక్ అందుకుంది.తెలుగులో వరుసగా సినిమాలు ప్లాప్స్ అవ్వడంతో అవకాశాలు తగ్గాయి. మన సినీ ఇండస్ట్రీ గురించి తెలిసిందే కదా..సెంటిమెంట్లకు బాగా నమ్ముతారు. అయితేనేం సోషల్ మీడియాలో అందాలను బహిర్గతం చేసే ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు మతులు పోగోట్టేస్తోంది అను. ఈరోజు అను తన పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ బర్త్ డే నుండైనా అనూ కి మంచి ఆఫర్స్ వస్తాయా? ఏమో పాపం. మంచి రేంజ్ కి వెళ్లి  ధమాల్ అంటూ కింద పడిపోయింది.. పాపం. ఏదైనా అంటే హీరోయిన్ మెటీరియల్ కాదు - పెద్ద హీరోలకు సరిపోదు అంటూ డైరెక్టర్స్ అందరూ ఈ బ్యూటీని పక్కన పెడుతున్నారు. కానీ ఇవన్నీ కారణాలు కాదు అందరితో ఫ్రాంక్ గా మాట్లాడటమే ఈ ముద్దగుమ్మకి ఉన్న పెద్ద మైనస్ అంట. మరీ అలా ఉంటే ఇక్కడ ఆఫర్స్ రావు పాప. కొంత లౌక్యం నేర్చుకొని ఆఫర్స్ పట్టేయాలి అనూ బేబీ.