Begin typing your search above and press return to search.

ఫేడ‌వుట్ అయినా యాటిట్యూడ్ మార‌లేదా?

By:  Tupaki Desk   |   26 Jan 2020 2:30 AM GMT
ఫేడ‌వుట్ అయినా యాటిట్యూడ్ మార‌లేదా?
X
ప‌వ‌న్ క‌ల్యాణ్.. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించింది అను ఇమ్మాన్యుయేల్. దుర‌దృష్ఠ‌వ‌శాత్తూ అగ్ర‌హీరోలెవ‌రూ త‌న‌కో హిట్టు ఇవ్వ‌లేక‌పోయారు. ఫ‌లితంగా ఐరెన్ లెగ్ ముద్ర వేసి టాలీవుడ్ దూరం పెట్టేసింది. ఆ క్ర‌మంలోనే అనూ ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల వైపు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం త‌మిళంలో మిస్కిన్ లాంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కుడితో ప‌ని చేస్తోంది. తుప్ప‌రివాల‌న్ అనే చిత్రంలో న‌టిస్తోంది.

అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో అనూ చాలానే యాటిట్యూడ్ చూపించింద‌ని మిస్కిన్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఓ స‌న్నివేశంలో కుర్తా ధ‌రించిన అనూ కింద ప‌డాల్సి ఉంటుంది. ఆ టైమ్ లో ప‌క్క‌నే ఉన్న ఆండ్రియా త‌న కుర్తా అంచు మురికిలో ప‌డి పాడ‌వ్వ‌కుండా సాయం చేయాల్సిందిగా కోరాడ‌ట‌. త‌ను అందుకు అంగీక‌రించినా `మైండ్ యువ‌ర్ బిజినెస్` అంటూ ఆండియా పై అనూ రుస‌రుస‌లాడేసింద‌ట‌. అయితే ఆ త‌ర్వాత త‌న‌ని ప‌క్క‌కు పిలిచి సీనియ‌ర్ల‌ను గౌర‌వించాల‌ని.. ఆండ్రియా త‌న‌కంటే సీనియ‌ర్ అని మిస్కిన్ క్లాస్ తీస్కున్నాడ‌ట‌.

మొత్తానికి అనూ యాటిట్యూడ్ బ‌య‌ట‌ప‌డిందిలా. సైకో చిత్రం ఈ శుక్ర‌వారం రిలీజైంది. పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ఇక మిస్కిన్ ఇద్ద‌రేసి హీరోయిన్లతో సినిమాలు తీయ‌డంలో ఘ‌నాపాటి. సైకో చిత్రంలో నిత్యామీన‌న్ - అథిదీరావ్ హైద‌రీ లాంటి ట్యాలెంటెడ్ క‌థానాయిక‌లుగా న‌టించారు. మ‌రి ఆ ఇద్ద‌రి మ‌ధ్యా యాటిట్యూడ్ స‌మ‌స్య త‌లెత్త‌లేదా? ఈగోల గోలేమీ లేదా? అన్న‌ది కూడా ఆయ‌నే చెప్పాలి మ‌రి.