వీడియో సాంగ్: అనుబేబీ ని బుజ్జగిస్తున్న చైతు!

Fri Aug 10 2018 14:11:23 GMT+0530 (IST)

Anu Baby Video Song From Naga Chaitanya Sailajareddy Alludu Movie

అక్కినేని నాగ చైతన్య - అను ఇమ్మాన్యుయేల్ లు హీరో హీరోయిన్లు గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'శైలజా రెడ్డి అల్లుడు'.  ఇప్పటికే ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ - టీజర్ తో ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నం చేసిన మేకర్స్ తాజాగా సినిమానుండి 'అను బేబీ' అంటూ సాగే ఈ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.కోపంలో ఉన్న ఈగో పిల్ల అను ఇమ్మాన్యుయేల్ ను శాంతింపజేసే ప్రయత్నంలో చైతు పాడే పాటే ఇది.  సరదా టోన్ లో సాగే ఈ పాటను రాసింది కృష్ణ కాంత్ కాగా అనుదీప్ దేవ్ సింగర్.  గోపిసుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అనే విషయం తెలిసిందే కదా.  ఈ పాటకు డాన్స్ మాస్టర్ శేఖర్ కొరియోగ్రఫీ అందించాడు.   కోపంతో మూతి ముడుచుకుని ఉన్న అను వెంట పడుతూ 'అనూ బేబీ సరే ఆగవే.. అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే' అంటూ ఫన్నీ లిరిక్స్ తో సాగుతుంది.  అను ఒక్కటే బుంగమూతి తో ఉన్నా వెనక మెక్సికన్ కార్నివాల్ వాతావరణం తరహాలో డాన్సర్ల హంగామా ఉంది.  శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ ను చైతు భయ్యా ఇరగదీస్తూ ఫుల్ జోష్ లో లవర్ ని కూల్ చేస్తున్నాడు.  గోపి సుందర్ ట్యూన్ కూడా క్యాచీగా ఉంది.  చూస్తుంటే ఫస్ట్ సాంగ్ ఆడియన్స్ ను మెప్పించేలానే ఉంది. డైరెక్టర్ మారుతి మార్క్ ఫన్ ఈ సాంగ్ లో రిఫ్లెక్ట్ కావడం విశేషం.

రమ్య కృష్ణ పవర్ ఫుల్ అత్తగారి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఫుల్ ఈగో ఉన్న కూతురిగా అను నటిస్తోంది.  ఈ పాట చూస్తుంటే అటు అత్తగారిని ఇటు ఈగో పిల్లని దీటుగా ఎదుర్కొనేలా ఉన్నాడు మన చైతు.. ఇంకెందుకాలస్యం.. చదవడానికి కొంచెం బ్రేక్ ఇచ్చి పాట చూడడానికి రెడీ అవ్వండి.