Begin typing your search above and press return to search.

`అంటే సుంద‌రానికి` OTT రిలీజ్ డేట్

By:  Tupaki Desk   |   3 July 2022 4:03 PM GMT
`అంటే సుంద‌రానికి` OTT రిలీజ్ డేట్
X
నేచుర‌ల్ స్టార్ నాని-నజ్రియా జంట‌గా నటించిన తాజా చిత్రం `అంటే సుందరానికి` ఇటీవ‌లే రిలీజై ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే. పెద్ద తెర‌పై ఈ చిత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేదు. సానుకూల సమీక్షలు వ‌చ్చినా కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఇంత‌లోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. జూలై 10 నుండి అంతర్జాతీయ OTT లో ప్రసారం కానుంది.

స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ తాజాగా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో రిలీజ్ తేదీ వివ‌రాలు వెల్ల‌డించింది. ``సుందర్ మరియు లీల వివాహ కథను చూసేందుకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము`` అని అందులో పేర్కొన్నారు. తేదీని సేవ్ చేసుకోండి! అంటే సుందరానికి తెలుగు- మలయాళం- తమిళంలో జూలై 10న నెట్ ఫ్లిక్స్ లో వస్తోంది`` అని వెల్ల‌డించింది. అంటే సుంద‌రానికి రొమాంటిక్ కామెడీ జోన‌ర్ లో వ‌చ్చింది. మలయాళం-తమిళ నటి నజ్రియా నజీమ్ ఫహద్ తెలుగు అరంగేట్ర చిత్ర‌మిది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రానికి `బ్రోచేవారెవరురా` -`మెంటల్ మదిలో` చిత్రాల‌ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.

ఆ రెండు క్రేజీ చిత్రాలు స్ట్రీమింగ్

జూలై 1 న రానా న‌టించిన విరాట‌ప‌ర్వం - అక్ష‌య్ కుమార్ న‌టించిన సామ్రాట్ పృథ్వీరాజ్ ఓటీటీలో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాలు జాన‌ర్ ప‌రంగా దేనిక‌దే యూనిక్. విరాట‌ప‌ర్వం సోష‌ల్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్క‌గా.. సామ్రాట్ పృథ్వీరాజ్ వీరుని క‌థ‌తో వార్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కింది. రానా ద‌గ్గుబాటి- సాయి పల్లవి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన `విరాట పర్వం` జూలై 1 నుండి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతోంది. తెలుగు- మలయాళం- తమిళంలో ఇది అందుబాటులో ఉంది. విరాట‌ప‌ర్వం ఈ ఏడాది జూన్‌ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం 15 రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి వ‌చ్చేసింది.

తెలంగాణ ప్రాంతంలో 1990లలో జరిగిన వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొంది రూపొందించిన చిత్ర‌మిది. రానా కలం పేరు `అరణ్య`. అత‌డు కామ్రేడ్ రావన్న పాత్రను ర‌చిస్తాడు. ఆ పాత్ర‌లో అత‌డు క‌నిపిస్తాడు. కామ్రేడ్ రవన్న రచనలను ఆరాధించే వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటించింది. ఆ ఇరువురి న‌డుమ ప్రేమ‌క‌థ ఉద్య‌మం వ‌గైరా అంశాలు ఉత్కంఠ‌ను క‌లిగిస్తాయి. తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ల ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. డి సురేష్ బాబు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పించ‌గా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ప‌తాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. డాని శాంచెజ్ లోపెజ్ - దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్ లు కాగా .. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ప్రియమణి- నందితా దాస్- నవీన్ చంద్ర- జరీనా వహాబ్- ఈశ్వరీ రావు- సాయి చంద్ ముఖ్యమైన పాత్రలలో న‌టించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వ‌ర్క్ అందించ‌గా.. స్టీఫెన్ రిచర్డ్ - పీటర్ హెయిన్ స్టంట్స్ కొరియోగ్రాఫ్ చేసారు.

మ‌రోవైపు థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల లోపు అక్షయ్ కుమార్ నటించిన `సామ్రాట్ పృథ్వీరాజ్` అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసార‌మ‌వుతోంది. జూన్ 3న ఈ హిందీ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు జూలై 1 నుండి ఓటీటీలో ప్రసారం మొద‌లైంది. హిందూ రాజవంశానికి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్ గా అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో న‌టించ‌గా థియేట్రిక‌ల్ గా ఫ్లాపైన సంగ‌తి తెలిసిన‌దే. చంద్ర‌ప్ర‌కాష్ ద్వివేది ద‌ర్శ‌క‌త్వంలో య‌ష్ రాజ్ ఫిలింస్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించింది. మాజీ మిస్ వ‌రల్డ్ మానుషి చిల్ల‌ర్ ఇందులో క‌థానాయిక‌గా న‌టించింది.