ఇద్దరు సూపర్ స్టార్స్ కు నో చెప్పిన మరో సూపర్ స్టార్

Sat Jan 29 2022 22:00:01 GMT+0530 (IST)

Another superstar who said no to two superstars

భాష ఏదైనా మల్టీ స్టారర్ సినిమా అంటే ప్రేక్షకులు కళ్లు పెద్దవి చేసుకుని మరీ చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇటీవల హిందీలో వచ్చిన మల్టీ స్టారర్ మూవీ సూర్యవంశీ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముగ్గురు హీరోలు కలిసి నటించిన ఆ సినిమా కోవిడ్ కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేకున్నా కూడా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అదో భారీ మల్టీ స్టారర్ అవ్వడం వల్లే అంత భారీగా వసూళ్లను రాబట్టింది అనడంలో సందేహం లేదు. ఇతర భాషల్లో కూడా మల్టీ స్టారర్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

తెలుగు లో కూడా ప్రస్తుతం రూపొందుతున్న మల్టీ స్టారర్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నాయి. అందుకే మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలను తీసుకు వచ్చేందుకు ఫిల్మ్ మేకర్స్ ఆసక్తిగా ఉన్నారు. తాజాగా హిందీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ సంస్థ వారు రెండు భారీ మల్టీ స్టారర్ సినిమాలకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ రెండు భారీ చిత్రాలకు గాను హృతిక్ రోషన్ ను సంప్రదించగా ఆయన నో చెప్పాడనే వార్తలు చర్చనీయాంశం అవుతున్నాయి.

మల్టీ స్టారర్ మూవీస్ ఈమద్య కాలంలో బాలీవుడ్ లో కామన్ అయ్యాయి. కనుక షారుఖ్ ఖాన్ హీరోగా యశ్ రాజ్ బ్యానర్ లో రూపొందబోతున్న పఠాన్ 2 సినిమా లో హృతిక్ రోషన్ ను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. సినిమాలో అత్యంత కీలక పాత్రకు గాను హృతిక్ రోషన్ ను సంప్రదించడం జరిగిందట. మొదట కథ మరియు పాత్ర నచ్చిందంటూ సరే అన్నట్లుగా ఆయన నుండి స్పందన వచ్చిందట. కాని అనూహ్యంగా షారుఖ్ తో కలిసి పఠాన్ 2 లో నటించేందుకు సిద్దంగా లేను అన్నట్లుగా ప్రకటించాడట. దాంతో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా ను చూసే అవకాశం బాలీవుడ్ ప్రేక్షకులు మిస్ చేసుకున్నారు. సరే షారుఖ్ ఖాన్ సినిమా లో నటించేందుకు ఆసక్తి చూపించని హృతిక్ రోషన్ కనీసం సల్మాన్ తో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడేమో అంటూ యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు టైగర్ 3 కోసం కూడా సంప్రదించారట. సల్మాన్ ఖాన్ సినిమాలో కూడా నటించేందుకు హృతిక్ రోషన్ నో చెప్పాడనే వార్తలు వస్తున్నాయి.ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సొంతం చేసుకోవాలంటే హృతిక్ రోషన్ నటిస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో కనీసం ఒక్క సినిమాలో అయినా హృతిక్ రోషన్ ను నటింపజేసేందుకు ఇంకా కూడా మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. యశ్ రాజ్ సంస్థ వారితో హృతిక్ రోషన్ కు సంబంధాలు బాగున్నాయి. కనుక వారి కోసం అయినా హృతిక్ రోషన్ ఈ మల్టీ స్టారర్ లో నటించేందుకు ఓకే చెప్పే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం ఆయన ఇమేజ్ కు తగ్గట్లుగా స్క్రిప్ట్ వర్క్ ను మార్చి మళ్లీ టైగర్ 3 స్క్రిప్ట్ ను వినిపించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించబోతున్న సినిమా కు కూడా హృతిక్ రోషన్ ను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి ఇద్దరు సూపర్ స్టార్ సినిమాల్లో ఎవరిదో ఒకరి మూవీని సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఒప్పుకోక తప్పదు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు కూడా ఓ భారీ మల్టీ స్టారర్ ను కోరుకుంటున్నారు. కనుక హృతిక్ రోషన్ ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడ కామెంట్స్ చేస్తున్నారు. మరి హృతిక్ రోషన్ నిర్ణయం ఏంటీ అనేది చూడాలి.